ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫలితాలకు ముందే బేరసారాలు షురూ

ABN, First Publish Date - 2022-03-10T06:52:09+05:30

ఐదు రాష్ట్రాల ఫలితాలకు ముందే బేరసారాలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బీజేపీ నుంచి ఎమ్మెల్యేల రక్షణకు కాంగ్రెస్‌ యత్నాలు


న్యూఢిల్లీ, మార్చి 9(ఆంధ్రజ్యోతి): ఐదు రాష్ట్రాల ఫలితాలకు ముందే బేరసారాలకు షురూ అయిపోయాయి. ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడుతుందన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అప్రమత్తమైంది. తమ ఎమ్మెల్యేలను బీజేపీ నేతల ప్రలోభాల నుంచి కాపాడుకునేందుకు చర్యలు చేపట్టింది. ఉత్తరాఖండ్‌లోని 70 సీట్లలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటించాయి. బీజేపీ తరఫున బేరసారాలు నడిపేందుకు మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత కైలాష్‌ విజయ వర్గీయ డెహ్రాడూన్‌ వచ్చారు.


ఉత్తరాఖండ్‌కు చెందిన తమ ఎమ్మెల్యేలను ఛత్తీ్‌సగఢ్‌లోని రాయపూర్‌లో రిసార్ట్‌కు తరలించాలని, గోవా ఎమ్మెల్యేలను మరో రాష్ట్రానికి తరలించాలని కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. ఉత్తరాఖండ్‌ ఎమ్మెల్యేల బాధ్యతను ఛత్తీ్‌సగఢ్‌ సీఎం భూపేష్‌కు అప్పగించారు. గోవా ఎమ్మెల్యేల బాధ్యతను కర్ణాటకకు చెందిన కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌కు అప్పగించారు. ఇక మణిపూర్‌లో టీఎస్‌ సింగ్‌దేవ్‌ పర్యవేక్షిస్తున్నారు. గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటులో ఆప్‌, టీఎంసీ కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి.

Updated Date - 2022-03-10T06:52:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising