ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bangladesh నేవీ దాడులు..135 మంది భారత మత్స్యకారుల అరెస్ట్

ABN, First Publish Date - 2022-06-30T13:49:03+05:30

బంగ్లాదేశ్ నేవీ 135 మంది భారతీయ మత్స్యకారులను అదుపులోకి తీసుకుంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢాకా (బంగ్లాదేశ్): బంగ్లాదేశ్ నేవీ 135 మంది భారతీయ మత్స్యకారులను అదుపులోకి తీసుకుంది. బంగ్లాదేశ్ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి చేపలు పట్టినందుకు 8 ట్రాలర్లను బంగ్లాదేశ్ నావికాదళం స్వాధీనం చేసుకుంది.సముద్రంలో గస్తీ తిరుగుతూ నేవీ సిబ్బంది దాడులు నిర్వహించి భారత జాలర్లను అదుపులోకి తీసుకున్నారు.బనౌజా ప్రత్య, అలీ హైదర్ అనే నేవీ నౌకలు సముద్రంలో గస్తీ నిర్వహిస్తున్న సమయంలో నాలుగు ట్రాలర్లతో 68 మంది భారతీయ మత్స్యకారులను మొదటి దశలో అరెస్టు చేశామని బగర్‌హాట్ జిల్లా పోలీసు మీడియా సెల్ అధికారి ఎస్‌ఎం అష్రాఫుల్ ఆలం తెలిపారు.ఆ తర్వాత అదే బృందంలో మరో 67 మంది మత్స్యకారులను నేవీ అదుపులోకి తీసుకుని నాలుగు ట్రాలర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


స్వాధీనం చేసుకున్న చేపలతో సహా వాటి మార్కెట్ విలువ 3.8 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.బంగ్లాదేశ్ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి చేపలు పట్టడంపై పోలీసు కేసు నమోదైంది. అరెస్టయిన భారతీయ మత్స్యకారులను కూడా బగర్‌హాట్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు జైలుకు పంపిందని మోనిరుల్ ఇస్లాం తెలిపారు.న్యాయపరమైన ప్రక్రియను పూర్తి చేసి మత్స్యకారులను కోర్టుకు తరలించారు.


Updated Date - 2022-06-30T13:49:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising