ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bangladesh and India : మోదీపై బంగ్లాదేశ్ పీఎం హసీనా ప్రశంసల జల్లు

ABN, First Publish Date - 2022-09-04T19:42:17+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని భారత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢాకా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని భారత ప్రభుత్వంపై బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా (Sheikh Hasina) ప్రశంసల జల్లు కురిపించారు. కోవిడ్-19 మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయాల్లో తమకు అందించిన సహాయానికి ధన్యవాదాలు తెలిపారు. ఆమె సోమవారం భారత పర్యటనకు రాబోతున్న నేపథ్యంలో ఓ వార్తా సంస్థతో ఆమె ఆదివారం మాట్లాడారు.


వ్యాక్సిన్ మైత్రి పథకంలో భాగంగా తమకు కోవిడ్ వ్యాక్సిన్లను అందజేసినందుకు, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమ దేశ విద్యార్థినీ, విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయన్నారు. విభేదాలు ఉండవచ్చునని, అయితే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు. అనేక అంశాల్లో భారత్, బంగ్లాదేశ్ ఈ విధంగా సహకరించుకుంటున్నాయన్నారు. 


బంగ్లాదేశ్ ప్రజలకు భారత ప్రభుత్వం చేసిన రెండు సహాయాలు ప్రత్యేకంగా ప్రశంసించదగినవని తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లోనూ, దాని పొరుగు దేశమైన పోలండ్‌లోనూ భారతీయ విద్యార్థుల మాదిరిగానే తమ దేశ విద్యార్థులు కూడా చిక్కుకుపోయారన్నారు. ఆ విద్యార్థులను సురక్షితంగా తిరిగి తీసుకురావడంలో భారత దేశం చేసిన సహాయానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇది నిజమైన స్నేహపూర్వక చర్య అని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెప్తున్నానని తెలిపారు. 


వ్యాక్సిన్ మైత్రి పథకంలో భాగంగా బంగ్లాదేశ్‌కు మాత్రమే కాకుండా కొన్ని దక్షిణాసియా దేశాలకు కూడా కోవిడ్ వ్యాక్సిన్లను పంపించారని, మోదీకి ధన్యవాదాలు చెప్తున్నానని తెలిపారు. ఈ వ్యాక్సిన్లు తమకు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపారు. ఇది మోదీ దార్శనికతతో చేపట్టిన  చర్య అని పేర్కొన్నారు. అంతేకాకుండా తాము తమ సొంత నిధులతో టీకాలను కొన్నామని, మరికొన్ని దేశాలు కూడా తమకు టీకాలను అందజేశాయని వివరించారు. 


భారత్-బంగ్లాదేశ్ మధ్య స్నేహం కాల పరీక్షకు నిలిచిందన్నారు. అవసరమైన ప్రతిసారీ బంగ్లాదేశ్‌కు భారత్ అండగా నిలిచిందన్నారు. మొదట 1971లో జరిగిన యుద్ధంలో, ఆ తర్వాత ఇతర సందర్భాల్లో తమకు భారత్ మద్దతుగా ఉంటోందన్నారు. 


Updated Date - 2022-09-04T19:42:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising