ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Extramarital sex : ఇండోనేసియాలో సహజీవనంపై నిషేధం

ABN, First Publish Date - 2022-12-07T04:14:16+05:30

వివాహేతర సంబంధం (ఎక్స్‌ట్రా మారిటల్‌ సెక్స్‌), సహజీవనాన్ని నిషేధించే చట్టానికి ఇండోనేసియా పార్లమెంటు మంగళవారం ఆమోదం తెలిపింది. కొత్త చట్టం ప్రకారం వివాహేతర లైంగిక సంబంధాలను నేరంగా పరిగణిస్తారు. వారికి ఏడాది జైలు శిక్ష విధిస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వివాహేతర శృంగారంపైన కూడా..

అతిక్రమిస్తే ఏడాది పాటు జైలు

మండిపడుతున్న హక్కుల సంఘాలు

జకార్తా, డిసెంబరు 6: వివాహేతర సంబంధం (ఎక్స్‌ట్రా మారిటల్‌ సెక్స్‌), సహజీవనాన్ని నిషేధించే చట్టానికి ఇండోనేసియా పార్లమెంటు మంగళవారం ఆమోదం తెలిపింది. కొత్త చట్టం ప్రకారం వివాహేతర లైంగిక సంబంధాలను నేరంగా పరిగణిస్తారు. వారికి ఏడాది జైలు శిక్ష విధిస్తారు. పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించడాన్ని (సహజీవనం) కూడా నేరంగా పరిగణించి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు. ఈ కొత్త క్రిమినల్‌ కోడ్‌కు మొత్తం తొమ్మిది పార్టీలూ అంగీకరించిన తర్వాత డిప్యూటీ స్పీకర్‌ సుమ్‌ఫీ అహ్మద్‌ ఈ చట్టం ఆమోదం పొందినట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా న్యాయ, మానవ హక్కుల మంత్రి యసొన్నా లాలోరీ మాట్లాడుతూ.. ‘‘అనేక మంది అభిప్రాయాలు, కీలకమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించాం. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం’’ అని చెప్పారు. వివాహేతర శృంగారంపై నిషేధం విధించడాన్ని ఇండోనేసియా వ్యాపార సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోపించాయి. అయితే ఇండోనేసియాకు వచ్చే విదేశీయులపై కొత్త చట్టం ప్రభావం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేసియాలో స్వలింగ సంపర్కులపై ఇప్పటికే పలు ఆంక్షలు ఉన్నాయి. కొత్త చట్టం. ఈ కమ్యూనిటీపై తీవ్రప్రభావం చూపనుంది. ఈ చట్టాన్ని ఇండోనేసియాలోని హక్కుల సంఘాలు తప్పుబడుతున్నాయి. ఇది పౌరహక్కుల అణచివేతే అని మండిపడుతున్నాయి. కాగా, కొత్త చట్టానికి ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆయన ఆమోదం తెలిపిన తర్వాత మూడేళ్లకు ఈ చట్టం అమల్లోకి వస్తుంది.

Updated Date - 2022-12-07T04:14:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising