ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలమందిరాలలో పెరుగుతున్న పరారీలు

ABN, First Publish Date - 2022-03-13T18:15:37+05:30

సమాజంలో తల్లిదండ్రులు, బంధువులు లేని చిన్నారులకు ఆశ్రయం కల్పించేందుకు జిల్లా కేంద్రాలు, ప్రాంతాలవారీగా బాలమందిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. స్త్రీ శిశుసంక్షేమశాఖ పర్యవేక్షణలో కొనసాగుతు న్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- లోపించిన పర్యవేక్షణ

- వారికీ తప్పని వేధింపులు


బెంగళూరు: సమాజంలో తల్లిదండ్రులు, బంధువులు లేని చిన్నారులకు ఆశ్రయం కల్పించేందుకు జిల్లా కేంద్రాలు, ప్రాంతాలవారీగా బాలమందిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. స్త్రీ శిశుసంక్షేమశాఖ పర్యవేక్షణలో కొనసాగుతు న్న బాలమందిరాలలో ఇటీవల కొంతకాలంగా చిన్నారుల పరారీలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలోని పలు బాలమందిరాలలో ఇప్పటి వరకు 485 మంది చిన్నారులు పరారయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. తల్లిదండ్రులు లేనివారు, బాల్యవివాహాలు, ప్రేమ వివాహాలతోపాటు పలు నేరాల కారణంగా ఆసరాలేని చిన్నారులు రోడ్డున పడకుండా బాల మందిరాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. 2015లో బాలల న్యాయచట్టానికి అనుగుణంగా అన్ని జిల్లా కేంద్రాలలోనూ ఏర్పాటు చేశారు. ఇటీవలి కాలంలో వారి పర్యవేక్షణకోసం అన్ని కేంద్రాలలో సీసీ టీవీలను, భద్రతను కల్పించారు. బాలమందిరాలలోనూ వేధింపులు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 9 వేల మంది బాలకార్మికులకు రక్షణ కల్పించినట్టు కార్మికశాఖ ప్రకటించింది. 2018 నుంచి 2020 అవధిలో రాష్ట్రంలో 972 మంది చిన్నారులను రక్షించారు. కార్మిక, పోలీసు, స్త్రీ శిశుసంక్షేమశాఖలు సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నా బాలసదన్‌ల నుంచి చిన్నారులు పరారీ కావడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. పరారయిన చిన్నారుల గాలింపు కోసం పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు నమోదు చేశారు. 

Updated Date - 2022-03-13T18:15:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising