ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనాకు దొరికిన యువకుడి అప్పగింతలో జాప్యానికి కారణమదే: కిరణ్ రిజిజు

ABN, First Publish Date - 2022-01-27T00:20:12+05:30

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సియాంగ్ జిల్లా నుంచి ఈనెల 18న తప్పిపోయి చైనాకు దొరికిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సియాంగ్ జిల్లా నుంచి ఈనెల 18న తప్పిపోయి చైనాకు దొరికిన మీరం టోరన్‌ అనే యువకుడు త్వరలోనే వెనక్కి తిరిగి వస్తాడని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. మీరం టోరన్‌ను అప్పగించేందుకు చైనా సానుకూలంగా స్పందించిందని, ఇరువైపులా వాతావరణ ప్రతికూలత కారణంగానే అతని అప్పగింతలో జాప్యం జరుగుతోందని చెప్పారు.


మీరం టోరన్‌ను చైనా బలగాలు అపహరించాయని అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఎంపీ టాపిర్ గోవా ఇటీవల ఆరోపించాడు. దీంతో అతడి ఆచూకి కోసం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సాయాన్ని భారత సైన్యం కోరింది. ఈ క్రమంలోనే బాలుడిని కనుగొన్నామని, అతడిని భారత సైన్యానికి అందించే ప్రయత్నాలు ప్రారంభించామని పీఎల్ఏ పేర్కొంది. దీనిపై కిరణ్ రిజిజు ఓ ట్వీట్‌లో మరింత వివరణ ఇచ్చారు. ''రిపబ్లిక్ డే సందర్భంగా చైనా పీఎల్‌ఏతో హాట్‌లైన్‌లో ఇండియన్ ఆర్మీ సంభాషించింది. యువకుడిని అప్పగించేందుకు పీఎల్ఏ సానుకూలంగా స్పందించింది. ఏ ప్రాంతంలో అప్పగించాలో తెలియజేయాలని కూడా పేర్కొంది. సమయం, తేదీని కూడా నిర్ణయించి ఆ విషయం మనకు తెలియజేస్తుంది. ఇరువైపులా వాతావరణ ప్రతికూలతలు ఉన్నందునే యువకుడి అప్పగింత విషయంలో జాప్యం జరుగుతోంది'' అని కిరణ్ రిజిజు పేర్కొన్నారు.

Updated Date - 2022-01-27T00:20:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising