ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మన కంటికి కనిపించే బాక్టీరియా!

ABN, First Publish Date - 2022-06-25T09:13:07+05:30

బాక్టీరియా అంటే సూక్ష్మజీవులు. మైక్రోస్కో్‌పతో చూస్తే తప్ప కనిపించవు. కానీ మనిషి కంటికి కనిపించేంత పెద్ద బాక్టీరియాను అమెరికా పరిశోధకులు తాజాగా గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీబియన్‌ దీవుల్లో.. గుర్తించిన అమెరికా పరిశోధకులు

వాషింగ్టన్‌, జూన్‌ 23: బాక్టీరియా అంటే సూక్ష్మజీవులు. మైక్రోస్కో్‌పతో చూస్తే తప్ప కనిపించవు. కానీ మనిషి కంటికి కనిపించేంత పెద్ద బాక్టీరియాను అమెరికా పరిశోధకులు తాజాగా గుర్తించారు. కరీబియన్‌ దీవుల్లోని మడ అడవుల్లో కనిపించిన ఇవి, తెల్లటి రంగులో 0.9 సెంటీమీటర్ల పరిమాణంలో మనిషి కనురెప్పను పోలి ఉన్నాయని వారు పేర్కొన్నారు. కాలిఫోర్నియాలోని లారెన్స్‌ బెర్కిలీ నేషనల్‌ లాబొరేటరీ, ఫ్రెంచ్‌ వెస్టిండీ్‌సలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్రెంచ్‌ వెస్టిండీస్‌ పరిశోధకులు సంయుక్తంగా ఈ పరిశోధననను చేపట్టారు. మడ అడవుల్లోని చెట్లకే కాక అక్కడి నత్తగుల్లలు, రాళ్లు, గాజు సీసాల్లోనూ వీటిని గుర్తించామని అందులో స్పష్టం చేశారు. దీన్ని థియోమార్గరీటా మెగ్నిఫికాగా వారు వ్యవహరిస్తున్నారు. సాధారణంగా ఇతర బాక్టీరియాల్లో ఉండే కణంలోని నిర్మాణం కంటే దీనిలోని కణ నిర్మాణం విభిన్నంగా ఉందని వివరించారు. ఇతర బాక్టీరియాలతో పోలిస్తే ఇది ఎందుకు ఇంత పెద్దగా ఉందన్న ప్రశ్నకు తమ వద్ద ఇంకా సమాధానం లేదని, పరిణామక్రమంలో అది ఇలా తన స్వీయరక్షణకోసం ఆకారం పెంచుకుని ఉండొచ్చని వారు అంచనా వేశారు. 

Updated Date - 2022-06-25T09:13:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising