ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒంటరిగానే పోటీచేస్తాం, కానీ.. : చంద్రశేఖర్ ఆజాద్

ABN, First Publish Date - 2022-01-18T21:19:21+05:30

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ స్పష్టం చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు అంశంపై మాట్లాడుతూ.. ఈ విషయమై చర్చలు జరిపి సాయంత్రం నాటికి ఏ విషయమూ వెల్లడిస్తామని చెప్పారు. యూపీలో తాము ప్రత్యామ్నాయం అవుతామన్నారు. ఎమ్మెల్యే, మంత్రి అంటూ వచ్చిన ఆఫర్లను తిరస్కరించానని పేర్కొన్నారు.


సమాజ్‌వాదీ పార్టీ తమకు 100 సీట్లు ఇస్తామని ఆఫర్ చేసినా తాము వెళ్లబోమని తేల్చి చెప్పారు. ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు ఇతర పార్టీలకు సాయం చేస్తామని చెప్పుకొచ్చారు. మాయావతితో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నించానని, కానీ అటువైపు నుంచి ఎవరూ తమను సంప్రదించలేదన్నారు. 


వ్యక్తిగత సంతోషాల గురించి తాను పట్టించుకోబోనని, గత ఐదేళ్లలో తాను ఎంతో కోల్పోయానని అన్నారు. హత్రాస్, ప్రయాగ్‌రాజ్, ఉన్నావో వంటి ఘటనల్లో నిరసనలు తెలిపి జైలు కూడా వెళ్లి వచ్చానన్నారు. ప్రతిపక్ష పార్టీల్లో విభజన వల్ల బీజేపీ కనుక మళ్లీ అధికారంలోకి వస్తే అది ప్రతి ఒక్కరికీ నష్టమేనని అన్నారు. భీమ్ ఆర్మీకి కార్యకర్తలే బలమని ఆజాద్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-18T21:19:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising