ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆజాద్ కాదు గులాం: పద్మ అవార్డుపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ వ్యంగ్య ట్వీట్

ABN, First Publish Date - 2022-01-26T13:06:23+05:30

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులాంనబీ ఆజాద్‌కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడంపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ వ్యంగ్య ట్వీట్ చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులాంనబీ ఆజాద్‌కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడంపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ వ్యంగ్య ట్వీట్ చేశారు. బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్జీ పద్మభూషణ్ అవార్డును తిరస్కరించారనే వార్తలను షేర్ చేస్తూ, జైరాం రమేష్ తన తోటి రాజకీయ నాయకుడు ఆజాద్‌కు అవార్డు ప్రకటించడంపై పరిహాసంగా ట్వీట్ చేశారు.‘‘గులాంనబీ ఆజాద్‌కు పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం సరైనది, అతను గులాం కాకుండా ఆజాద్‌గా ఉండాలనుకుంటున్నాడు’’ అంటూ ఆ ట్వీట్‌లో జైరామ్ రమేష్ వ్యాఖ్యానించారు.కాగా, గులాం నబీ ఆజాద్‌కు పద్మవిభూషణ్‌ అవార్డు లభించినందుకు మరో కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ అభినందనలు తెలిపారు.


‘‘పద్మభూషణ్ అవార్డు పొందిన సందర్భంగా గులాం నబీ ఆజాద్‌కు హృదయపూర్వక అభినందనలు. ఆయన ప్రజాసేవకు అవతలి వైపు ప్రభుత్వం కూడా గుర్తింపు పొందడం మంచిది’’ అని శశిథరూర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.సీనియర్ రాజకీయ నాయకులు బుద్ధదేవ్ భట్టాచార్జీ, గులాం నబీ ఆజాద్‌లు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. అయితే బుద్ధదేవ్ భట్టాచార్జీ అవార్డును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. 


Updated Date - 2022-01-26T13:06:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising