ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Adipurush : ‘ఆదిపురుష్’ను తక్షణం నిషేధించాలి : అయోధ్య రామాలయం ప్రధాన అర్చకుడు

ABN, First Publish Date - 2022-10-06T17:28:49+05:30

ఓం రౌత్ (Om Raut) నిర్మిస్తున్న సినిమా ‘ఆదిపురుష్’ను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఓం రౌత్ (Om Raut) నిర్మిస్తున్న సినిమా ‘ఆదిపురుష్’ను నిషేధించాలని అయోధ్య రామాలయం ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్ (Satyendra Das) డిమాండ్ చేశారు. రావణుడిని చూపించిన తీరు పూర్తిగా తప్పు, ఖండించదగినదని తెలిపారు. అయోధ్యలో ఏటా నిర్వహించే రథయాత్ర సందర్భంగా బుధవారం ఆయన ఈ డిమాండ్ చేశారు. 


శ్రీరాముడిని, హనుమంతుడిని ఇతిహాస రామాయణంలో వర్ణించినట్లుగా ఈ బాలీవుడ్ సినిమాలో చూపించడం లేదన్నారు. వారి గౌరవమర్యాదలకు విరుద్ధంగా చూపిస్తున్నారన్నారు. 


1.46 నిమిషాల నిడివిగల ‘ఆదిపురుష్’ టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. అప్పటి నుంచి ఈ సినిమాపై నిరసన వ్యక్తమవుతోంది. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రను ప్రభాస్ పోషించగా, రావణాసురుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషించారు. రావణాసురుడిని ఇస్లామీకరణ చేశారని అనేకమంది విమర్శలు గుప్పిస్తున్నారు. హనుమంతుడిని మీసాలు లేకుండా గెడ్డాలు పెట్టి, చర్మం ధరించినట్లు చూపించడాన్ని కూడా తప్పుబడుతున్నారు. వీఎఫ్ఎక్స్ కూడా పేలవంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. 


ఈ సినిమా 2023 జనవరి 12న విడుదలవుతుంది.


Updated Date - 2022-10-06T17:28:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising