ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AUSTRALIA POWER CRISIS.. అంధకారంలో అందాల నగరాలు..!

ABN, First Publish Date - 2022-06-17T01:34:00+05:30

ఆస్ట్రేలియాలో తీవ్ర విద్యుత్‌ సంక్షోభం నెలకొంది. బొగ్గు కొరత కారణంగా పలు రాష్ట్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి ఆగిపోయింది. ఫలితంగా పలు నగరాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినట్టు సమాచారం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్బెరా: ఆస్ట్రేలియాలో తీవ్ర విద్యుత్‌ సంక్షోభం నెలకొంది. బొగ్గు కొరత కారణంగా పలు రాష్ట్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి ఆగిపోయింది. ఫలితంగా పలు నగరాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. విద్యుత్‌ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు ప్రతిరోజు కొంత సమయం లైట్లు ఆర్పేయాలని ఆస్ట్రేలియా ఇంధన శాఖ మంత్రి క్రిస్‌ బొవెన్‌ కోరారు. రాత్రి సమయాల్లో విద్యుత్తు వస్తువుల వినియోగాన్ని నిలిపేయాలని సూచించారు. 


ఇటీవల ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌, న్యూసౌత్‌ వేల్స్‌ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిశాయి. వరదల కారణంగా బొగ్గు సరఫరా చేసే రైల్వే లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బొగ్గు గనుల్లో నీళ్లు నిలిచిపోయాయి. ఫలితంగా.. విద్యుత్తు లోటు ఏర్పడింది. ఇది మార్కెట్లో విద్యుత్తు ధరల పెరుగుదలకు దారితీసింది. దీంతో మెగావాట్‌ అవర్‌ ధర 300 డాలర్లను దాటేసింది. 


ఆస్ట్రేలియాలో 65 శాతం విద్యుత్తును బొగ్గుతోనే ఉత్పత్తి చేస్తారు. మరో 7శాతం ఎల్‌ఎన్‌జీ ద్వారా తయారు చేస్తారు. మిగిలినది పునరుత్పాదక ఇంధనం వనరులతో ఉత్పత్తి అవుతుంది. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో బొగ్గు సరఫరా తగ్గడంతో విద్యుత్తు ఫ్లాంట్లు పెద్ద ఎత్తున ఉత్పత్తిని నిలిపివేశాయి. ఫలితంగా ఇంధన ధరలు చుక్కలనంటాయి. 


మరోవైపు.. విద్యుత్‌ ఉత్పత్తి పెంచేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బొగ్గు సరఫరా పెంచేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రధాని ఆంటోనీ అల్బాన్సె అధికారులను ఆదేశించారు. ఆస్ట్రేలియాలో బొగ్గు కొరత భారత్‌‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. భారత్‌లో విద్యుత్తు ఉత్పత్తికి పవర్‌ ప్లాంట్ల అవసరాలకు సరిపడా జూన్‌-సెప్టెంబర్‌‌ వరకూ బొగ్గు నిల్వలను సమీకరించడం కష్టతరంగా మారనుందన్న అభిప్రాయాలు ఇప్పటికే వ్యక్తమవుతున్నాయి. సెంట్రల్‌ ఎలక్ట్ర్‌సిటీ అథారిటీ లెక్కల ప్రకారం 173 పవర్‌ ప్లాంట్లలో తొమ్మిది ప్లాంట్లు పూర్తిగా విదేశీ బొగ్గుపైనే ఆధారపడుతున్నాయి.  దీంతో.. రాబోయే రోజుల్లో డిమాండ్‌ను తట్టుకునేందుకు కోల్‌ ఇండియా.. రష్యా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా నుంచి దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. 

Updated Date - 2022-06-17T01:34:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising