ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UP: దేవుడి విగ్రహం తాకినందుకు దళితుడి హత్య..!

ABN, First Publish Date - 2022-10-05T01:00:07+05:30

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో తాజాగా ఓ దారుణం వెలుగులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో తాజాగా ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. దేవుడి విగ్రహం తాకినందుకు ఓ దళితుడు హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలానికి దారి తీసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు.. సందీప్ మిశ్రా, కుల్దీప్ మిశ్రా అనే ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ ఉదంతంపై స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల తరువాత కూడా ఇలాంటి ఘటనలు జరగటమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ప్రతాప్‌గఢ్ పోలీసులు తెలిపారు. వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు.


ఈ ఘటనపై సోషల్ మీడియాలో గగ్గోలు రేగుతోంది. సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్.. అనే నినాదంతో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ గద్దెనెక్కారనీ, కానీ..ఆయన పాలనలో కుల వివక్ష పెరిగిందని కొందరు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వమే మనువాదాన్ని ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు.  ఈ విషయంపై యూపీ సీఎం ఎందుకు పెదవి  విప్పడంలేదని కొందరు ప్రశ్నించారు. 

Updated Date - 2022-10-05T01:00:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising