ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వాతంత్య్ర దినోత్సవ వేళ... అమెరికాలో కాల్పుల మోత

ABN, First Publish Date - 2022-07-05T09:33:47+05:30

అమెరికాలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు కాల్పుల కలకలం రేగింది. షికాగో సమీపంలోని ఇలినాయిలో స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆరుగురి మృతి, 24 మందికి గాయాలు
  • ఇలినాయిలో ఘటనరిటైల్‌ దుకాణం పైనుంచి దుండగుడి కాల్పులు


షికాగో, జూలై 4: అమెరికాలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు కాల్పుల కలకలం రేగింది. షికాగో సమీపంలోని ఇలినాయిలో స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ సంఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. సుమారు 24 మందికి గాయాలయ్యాయి. వీరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. షికాగో శివారులోని హైల్యాండ్‌ పార్క్‌లో అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. వేడుకలు ప్రారంభమైన 10 నిమిషాల తర్వాత ఈ సంఘటన జరిగింది. దీంతో రోజంతా  నిర్వహించతలపెట్టిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలను పూర్తిగా రద్దుచేశారు. పరేడ్‌ జరుగుతున్న ప్రదేశానికి సమీపంలోని రిటైల్‌ స్టోర్‌ పైకెక్కి దుండగుడు కాల్పులు జరిపినట్టు స్థానిక వార్తాకథనాలు పేర్కొన్నాయి. సుమారు 20-25 సార్లు తుపాకీ పేలిన శబ్ధాలు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో పరేడ్‌ను తిలకిస్తున్న ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారు.


 ‘గన్‌షాట్స్‌’ అంటూ జనం పరుగులు తీస్తున్న వీడియోలు వెంటనే సోషల్‌ మీడియాలో వచ్చాయి. వేగంగా, వెంటవెంటనే కాల్పుల శబ్ధాలు రావడాన్ని బట్టి చూస్తే... నిందితుడు  హ్యాండ్‌గన్‌, షాట్‌గన్‌ లాంటివి కాకుండా వేరే తుపాకీని వాడినట్టు తెలుస్తోందని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లొద్దని ప్రజలకు పోలీసులు సూచించారు. ఈ సంఘటనతో  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిలిపేశారు. ఆ ప్రాంతంలో ఉన్నవారు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. ఎవరూ హైల్యాండ్‌ పార్క్‌ నగరంలోకి వెళ్లొద్దని తెలిపారు. గన్‌ కల్చర్‌ను నియంత్రించే ఉద్దేశంతో అమెరికా జూన్‌ నెలాఖర్లో ఓ చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే తాజా కాల్పుల సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం. అమెరికాలో కాల్పులు, తుపాకీతో ఆత్మహత్యల కారణంగా ఏటా సుమారు 40వేల మంది చనిపోతున్నట్టు కొన్ని అంచనాలు పేర్కొంటున్నాయి.

Updated Date - 2022-07-05T09:33:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising