ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ukraine లో రద్దీ మాల్‌పై Russia క్షిపణి దాడి.. ఇద్దరు మృతి.. 9 మంది పరిస్థితి విషమం..

ABN, First Publish Date - 2022-06-28T03:26:56+05:30

ఉక్రెయిన్‌(Ukrain)పై రష్యా(Russia) దాడులు కొనసాగుతున్నాయి. తూర్పు ఉక్రెయిన్‌లోని క్రెమెన్‌చుక్‌(Kremenchuk) నగరంలో రద్దీగా ఉన్న ఓ మాల్‌పై రష్యా బలగాలు క్షిపణి దాడి(Missile Attack) చేశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీవ్ : ఉక్రెయిన్‌(Ukrain)పై రష్యా(Russia) దాడులు కొనసాగుతున్నాయి. తూర్పు ఉక్రెయిన్‌లోని క్రెమెన్‌చుక్‌(Kremenchuk) నగరంలో రద్దీగా ఉన్న ఓ మాల్‌పై రష్యా బలగాలు క్షిపణి దాడి(Missile Attack) చేశాయి. సోమవారం జరిగిన ఈ దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 20 మంది గాయాలపాలయ్యారు. ఇందులో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Volodymyr Zelensky) ప్రకటించారు. 


దాడి సమయంలో షాపింగ్ సెంటర్‌లో(Shopping centre) వెయ్యి మందికిపైగా పౌరులు ఉన్నారని జెలెన్‌స్కీ తెలిపారు. క్షిపణి దాడి కారణంగా మాల్‌ను మంటలు చుట్టుముట్టాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్‌ఫైటర్లు కృషి చేస్తున్నారని జెలెన్‌స్కీ వెల్లడించారు. మంటల్లో చిక్కుకున్న వీడియోని ఆయన షేర్ చేశారు. డజన్ల మందిని రక్షిస్తున్నట్టు, మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది కృషి చేస్తున్నట్టు వీడియోలో కనిపించింది. కాగా రష్యా దాడిని పొల్టవా రీజియన్ గవర్నర్ దిమిత్రో లునిన్ ఖండించారు. యుద్ధ నేరాలకు ముగింపు పలకాలని రష్యాని ఆయన కోరారు.

Updated Date - 2022-06-28T03:26:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising