ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Speaker: వారికి అండగా నిలవండి

ABN, First Publish Date - 2022-08-24T13:23:11+05:30

వివిధ పనుల కోసం దేశం దాటి వలస వచ్చిన తమిళులకు అండగా నిలవాలని ప్రవాస తమిళులకు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ అప్పావు(State Assembly

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                  - ప్రవాసులకు స్పీకర్‌ పిలుపు


చెన్నై, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): వివిధ పనుల కోసం దేశం దాటి వలస వచ్చిన తమిళులకు అండగా నిలవాలని ప్రవాస తమిళులకు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ అప్పావు(State Assembly Speaker Appau) పిలుపునిచ్చారు. 65వ కామన్వెల్త్‌ సదస్సు కోసం ఇటీవల  కెనడా వెళ్లిన అప్పావు.. ఉత్తర అమెరికాలోనూ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సిలికానాంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న అప్పావు మాట్లాడుతూ.. స్టాలిన్‌ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం సామాన్యులకు అందుబాటులో వుందని, ఇది అందరి ప్రభుత్వమని కొనియాడారు. సామాన్యుల సమస్యలపై స్టాలిన్‌ ప్రత్యేక దృష్టి సారించి, పరిష్కరిస్తున్నారని ప్రశంసించారు. ఎంతోమంది సాఫ్ట్‌వేర్‌ రంగంలో పని చేస్తూ విదేశాలకు తరలివస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Former Chief Minister Karunanidhi) తమిళ ఫాంట్‌ రూపొందించేందుకు ప్రొఫెసర్‌ ఎం.అనంతకృష్ణన్‌ నేతృత్వంలో ఒక బృందాన్ని నియమించారని గుర్తు చేశారు. ఆ సమయంలోనే చెన్నైలో టైడర్‌ పార్క్‌ ఏర్పాటైందని, తద్వారా లక్షలాదిమంది ఉపాధి పొందుతున్నారని స్పీకర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత రాయబారి డాక్టర్‌ వి.నాగేంద్రప్రసాద్‌, అసెంబ్లీ కార్యదర్శి కె.శ్రీనివాసన్‌, తమిళఫోరం అధ్యక్షుడు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-24T13:23:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising