ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులే

ABN, First Publish Date - 2022-01-06T13:47:35+05:30

రాష్ట్ర శాసనసభ సమావేశాలు రెండు రోజులపాటు నిర్వహించాలని అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు సభాపతి అప్పావు ప్రకటించారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ నెల 6,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                       - సభాపతి అప్పావు ప్రకటన


చెన్నై: రాష్ట్ర శాసనసభ సమావేశాలు రెండు రోజులపాటు నిర్వహించాలని అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు సభాపతి అప్పావు ప్రకటించారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ నెల 6, 7 తేదీల్లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుందన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి స్టాలిన్‌ గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి మద్దతుగా ప్రసంగించడంతో సమావేశాలు ముగుస్తాయని తెలి పారు. గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే మాజీ శాసనసభ్యుల మృతికి సంతాపం తెలుపుతామని, ఆ తర్వాత ప్రశ్నోత్తరాల సమయం ఉంటుందని తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి అధికమవుతున్న కారణంగానే శాసనసభ సమావేశాలను రెండు రోజులపాటే జరపాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. శుక్రవారం శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి మద్ధతుగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ చేసే ప్రసంగాన్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామని అప్పావు తెలిపారు. రెండు రోజులపాటు ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులడిగే ప్రశ్నలు, వాటికి ఆయా మంత్రులు ఇచ్చే సమాధానాలను కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు.

Updated Date - 2022-01-06T13:47:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising