ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Assembly: సెప్టెంబరు 12 నుంచి శాసనసభ సమావేశాలు

ABN, First Publish Date - 2022-08-26T17:19:27+05:30

రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 12 నుంచి నిర్వహించేలా మంత్రివర్గం తీర్మానించింది. ఏటా వర్షాకాల సమావేశాలు జరిపే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 12 నుంచి నిర్వహించేలా మంత్రివర్గం తీర్మానించింది. ఏటా వర్షాకాల సమావేశాలు జరిపే సంప్రదాయంలో భాగంగా నిర్వహించదలచారు. తొమ్మిది రోజుల పాటు సమావేశాలు జరుగనున్నాయి. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. పలు అంశాలకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి మాధుస్వామి మీడియాకు వివరించారు. 12వ తేదీ నుంచి 23వరకూ సమావేశాలు జరుగుతాయన్నారు. కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షులు కెంపణ్ణతో పాటు కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) నాయకులు నిత్యం ఆరోపణలు చేస్తున్న 40శాతం కమీషన్‌ అంశంపై కూడా చర్చకు వచ్చిందన్నారు. కాగా శాసనసభ సమావేశాలలో శాసనసభలో ఆమోదం పొంది పరిషత్‌లో పెండింగ్‌లో ఉండే పలు బిల్లులను ఆమోదం లభించనుంది. పరిషత్‌లో అధికార బీజేపీకు స్పష్టమైన మెజారిటీ ఉండటంతో ఇకపై శాసనసభలో ఆమోదం లభించే అన్ని బిల్లులు పరిషత్‌లోను ఆమోదయోగ్యం లభించనున్నాయి.

Updated Date - 2022-08-26T17:19:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising