ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Assembly: పొంగల్‌ తర్వాత శాసనసభ సమావేశాలు...?

ABN, First Publish Date - 2022-12-16T08:38:12+05:30

పొంగల్‌ తర్వాత శాసనసభ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిసింది. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు అక్టోబరు 17

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), డిసెంబరు 15: పొంగల్‌ తర్వాత శాసనసభ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిసింది. రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు అక్టోబరు 17 నుంచి 19వ తేది వరకు జరిగాయి. ఆ సమావేశాలను ప్రొరోగ్‌ చేస్తూ గవర్నర్‌(Governor) గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణంగా ప్రతి ఏడాది ప్రారంభం తొలివారంలో గవర్నర్‌ ప్రసంగంతో శాసనసభ సమావేశాలు ప్రారంభమవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడం, నివారణ చర్యలు చేపడుతుండడం తదితర చర్యల కారణంగా, 2023 శాసనసభ సమావేశాలు పొంగల్‌ పండుగ తర్వాత ప్రారంభమయ్యే అవకాశముంది. ఆ సమావేశాల్లో రెండేళ్ల డీఎంకే ప్రభుత్వం చేపట్టిన పథకాల అమలు, కొత్తగా ప్రారంభించే పథకాలు గవర్నర్‌ ప్రసంగం లో చోటుచేసుకొనే అవకాశముంది. కొత్తగా మంత్రి పదవి చేపట్టిన ఉదయనిధి పేరు మంత్రుల జాబితాలో 10వ స్థానంలో ఉండడంతో, శాసనసభలో మొదటి వరుసలో ఆయనకు సీటు కేటాయించే అవకాశమున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం.

Updated Date - 2022-12-16T08:38:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising