ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

madrasa bulldozed: అల్ ఖైదాతో మదరసాకు లింక్...బుల్డోజరుతో కూల్చివేత

ABN, First Publish Date - 2022-08-30T14:49:09+05:30

ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో సంబంధాలున్నాయని(AlQaeda links) ఓ మదరసాను(madrasa) బుల్డోజరుతో కూల్చివేసిన ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బార్‌పేట(అసోం): ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో సంబంధాలున్నాయని(AlQaeda links) ఓ మదరసాను(madrasa) బుల్డోజరుతో కూల్చివేసిన ఘటన అసోం(Assam) రాష్ట్రంలోని బార్‌పేట జిల్లాలో తాజాగా వెలుగుచూసింది. అల్ ఖైదాకు చెందిన బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థ అన్సరుల్లా బంగ్లాటీమ్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై అక్బర్ అలీ, అబుల్ కలాం ఆజాద్ అనే ఇద్దరు సోదరులను అరెస్టు(arrest) చేసిన తర్వాత ధకలియాపరా వద్ద ఉన్న మదరసాను అసోం అధికారులు బుల్డోజరుతో కూల్చివేశారు.(madrasa bulldozed)మదరసా దేశ వ్యతిరేక కార్యకలాపాలు, జిహాదీ సంస్థల కార్యకలాపాల్లో పాలుపంచుకోవడంతోపాటు ప్రభుత్వ భూమిలో ఉన్నందున దాన్ని కూల్చామని ప్రభుత్వ అదనపు కమిషనర్ లచిత్ కుమార్ దాస్ చెప్పారు. 


మదరసా టెర్రరిస్టు హబ్‌గా నడుస్తున్నందున తాము దాన్ని బుల్డోజరుతో(bulldozer) కూల్చివేశామని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ (CM Himanta sarma) చెప్పారు.అంతకు ముందు ఆగస్టు 4వతేదీన కూడా అసోంలోని మోరిగావ్ జిల్లాలో ఒక మదరసాను కూల్చివేశారు.చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం, విపత్తు నిర్వహణ చట్టం కింద రెండు మదర్సాలను కూల్చివేశామని సీఎం హిమంత శర్మ చెప్పారు. ఈ ఏడాది అసోంలో ఐదు ఉగ్రవాద కుట్రలను ఛేదించి, పలువురిని అరెస్టు చేశామని అసోం అధికారులు చెప్పారు. 

Updated Date - 2022-08-30T14:49:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising