ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Assamలో వెల్లువెత్తిన వరదలు...222గ్రామాలు ముంపు

ABN, First Publish Date - 2022-05-16T12:33:58+05:30

అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో 222 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గువహటి: అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో 222 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. 15 రెవెన్యూ సర్కిళ్లలోని 222గ్రామాల్లో 57 వేల మంది ప్రజలు వరదల బారినపడి అల్లాడుతున్నారు. 10321 హెక్టార్ల వ్యవసాయ భూములు వరదనీటిలో మునిగాయి.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా డిమా హసావో జిల్లాలోని 12 గ్రామాల్లో శనివారం కొండచరియలు విరిగిపడ్డాయి.అసోం వరదల్లో ఇప్పటి వరకు ఓ చిన్నారి సహా ముగ్గురు మరణించారు. 1,434 పశువులు వరద బారిన పడ్డాయి. ఇప్పటివరకు వరదల వల్ల 202 ఇళ్లు దెబ్బతిన్నాయి.వరదల వల్ల డిమా హసావో జిల్లాలోని హఫ్లాంగ్ ప్రాంతంలో రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది.


ఆర్మీ, పారా మిలటరీ బలగాలు, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బంది వరద బాధిత ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యకలాపాలు చేపట్టాయి. హోజాయ్, లఖింపూర్, నాగావ్ జిల్లాల్లో అనేక రోడ్లు, వంతెనలు, నీటిపారుదల కాలువలు దెబ్బతిన్నాయి.భారీ కొండచరియలు విరిగిపడ్డాయి.ఈ కొండ భూభాగంలో రైల్వే ట్రాక్, వంతెనలు,రహదారి కమ్యూనికేషన్లకు భారీ నష్టం వాటిల్లింది.


Updated Date - 2022-05-16T12:33:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising