ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indian Muslimsను గుర్తించే ప్రక్రియకు Assam కేబినెట్ ఆమోదం

ABN, First Publish Date - 2022-07-06T17:35:03+05:30

అసోం రాష్ట్రంలో భారతీయ ముస్లింలను గుర్తించే ప్రక్రియకు ఆ రాష్ట్ర మంత్రివర్గం తాజాగా ఆమోదం తెలిపింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దిస్పూర్ (అసోం):అసోం రాష్ట్రంలో భారతీయ ముస్లింలను గుర్తించే ప్రక్రియకు ఆ రాష్ట్ర మంత్రివర్గం తాజాగా ఆమోదం తెలిపింది.భారతీయ ముస్లింలను గుర్తించే ప్రక్రియను అస్సాం ప్రభుత్వం ప్రారంభించిందని అసోం సీఎం హిమంత బిస్వా శర్మ ట్విట్టర్‌లో తెలిపారు.ఐదు అస్సామీ ముస్లిం ఉప సమూహాలైన గోరియాలు, మోరియాలు, జోలాలు, దేశీలు, సయ్యద్‌లను స్థానిక అస్సామీ ముస్లిం వర్గాలుగా గుర్తించేందుకు అస్సాం మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ట్వీట్ చేశారు.‘‘పాత వాహనాలను రద్దు చేయడం,ఐదు స్వదేశీ ముస్లిం సమూహాల గుర్తింపు, మాజీ సైనికులు,వారి వితంతువులకు ఆస్తి పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వడం, పునరుత్పాదక శక్తిని పెంచడం, డేటా యాక్సెస్‌ను మెరుగుపరచడం మొదలైన వాటికి సంబంధించి మేం పలు నిర్ణయాలు తీసుకున్నాం’’అని సీఎం శర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు.


దేశానికి చేసిన సేవలకు కృతజ్ఞతగా మాజీ సైనికులు,వారి వితంతువులకు ఆస్తిపన్ను చెల్లించకుండా మినహాయింపు ఇవ్వాలని అసోం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దేశానికి చేసిన సేవకు కృతజ్ఞతగా మాజీ సైనికులు,వితంతువులు ఆస్తిపన్ను చెల్లించకుండా మినహాయించేందుకు అస్సాం మున్సిపల్ చట్టం, 1956గౌహతి మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, 1969లను సవరించే బిల్లులను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి కేశబ్ మహంత తెలిపారు.అసోం రాష్ట్ర 10వ తరగతి బోర్డు పరీక్షలో మొదటి డివిజన్‌లో ఉత్తీర్ణత సాధించిన ప్రతి విద్యార్థికి ఒకేసారి రూ.16,000 స్కాలర్‌షిప్ చెల్లించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.


Updated Date - 2022-07-06T17:35:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising