ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Archaeological Survey : పాట్నాలో 2,000 ఏళ్ళనాటి గోడలు

ABN, First Publish Date - 2022-06-04T23:36:57+05:30

బిహార్‌లోని కుమ్రహార్ ప్రాంతంలో ఓ చెరువు పునరుద్ధరణ పనులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా : బిహార్‌లోని కుమ్రహార్ ప్రాంతంలో ఓ చెరువు పునరుద్ధరణ పనులు జరుగుతుండగా దాదాపు 2,000 ఏళ్ళనాటి ఇటుక గోడల అవశేషాలు బయటపడ్డాయి. భారత పురాతత్వ అధ్యయనాల సంస్థ (Archaeological Survey of India) పాట్నా సర్కిల్ వీటిని గుర్తించింది. గతంలో ఈ ప్రాంతంలో మౌర్య సామ్రాజ్య కాలంనాటి అవశేషాలు కనిపించాయి. 


ఏఎస్ఐ పాట్నా సర్కిల్ పర్యవేక్షక ఆర్కియాలజిస్ట్ గౌతమి భట్టాచార్య మీడియాతో మాట్లాడుతూ, పాట్నా రైల్వే స్టేషన్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో కుమ్రహార్ వద్ద ఓ చెరువు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. దీనికి సంబంధించిన తవ్వకాల్లో ఇటుక గోడల అవశేషాలు గురువారం కనిపించాయన్నారు. ఈ గోడ దాదాపు 2,000 సంవత్సరాల క్రితంనాటిదని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 


కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అమృత్ సరోవర్’ పథకంలో భాగంగా ఈ చెరువు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయన్నారు. ఇక్కడ కనిపించిన ఇటుక గోడలకు చాలా ప్రాధాన్యం ఉందన్నారు. ఏఎస్ఐ నిపుణుల బృందం ఈ గోడలకుగల పురాతత్వ ప్రాధాన్యాన్ని విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. ఈ ఇటుకలు కుషాణుల కాలంనాటివని భావిస్తున్నామన్నారు. కుషాణుల పరిపాలనలో ఉత్తర భారత దేశం, ప్రస్తుత ఆఫ్ఘనిస్థాన్, మధ్య ఆసియాలో కొంత భాగం ఉండేవని చెప్పారు. ఈ ఇటుకలు సామాన్య శకం 30 నుంచి సామాన్య శకం 375 మధ్య కాలానికి చెందినవని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ ఇటుక గోడల గురించి న్యూఢిల్లీలోని ఏఎస్ఐ ప్రధాన కార్యాలయానికి సమాచారం ఇచ్చామని చెప్పారు. 


కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ అమృత్ సరోవర్‌లో భాగంగా బిహార్‌లోని అన్ని (11) రక్షిత జలాశయాలను ఏఎస్ఐ-పాట్నా పునరుద్ధరిస్తోంది. 


Updated Date - 2022-06-04T23:36:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising