ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌కు కేంద్ర మాజీ మంత్రి అశ్వనికుమార్ రాజీనామా

ABN, First Publish Date - 2022-02-15T18:06:31+05:30

కాంగ్రెస్‌ పార్టీకి మరో సీనియర్ నేత షాక్ ఇచ్చారు. కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి డాక్టర్ అశ్వని కుమార్ కాంగ్రెస్ పార్టీకి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీకి మరో సీనియర్ నేత షాక్ ఇచ్చారు. కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి డాక్టర్ అశ్వని కుమార్ కాంగ్రెస్ పార్టీకి ఉద్వాసన చెప్పారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపారు. ప్రస్తుత పరిణామాలు, దేశ విస్తృత ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని, గౌరవప్రదంగా పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆ లేఖలో అశ్వని కుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో 46 ఏళ్ల సుదీర్ఘ పయనం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పార్టీలో తనకు లభించిన గౌరవానికి సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు ఆ లేఖలో అశ్వని కుమర్ పేర్కొన్నారు.

Updated Date - 2022-02-15T18:06:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising