ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Congress presidential elections: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రోజే షాకిచ్చిన గెహ్లాట్

ABN, First Publish Date - 2022-10-17T19:05:01+05:30

జైపూర్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల రోజే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ షాకిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల రోజే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ షాకిచ్చారు. పార్టీలో యువకులకు సంయమనమే ఉండటం లేదంటూ సచిన్ పైలట్‌కు చురకలంటించారు. అలాగే చాడీలు చెప్పడం కూడా మానుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అధ్యక్ష ఎన్నికల రోజే గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 


గెహ్లాట్ తీరుపై రగడ


వాస్తవానికి కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో ఉండాల్సిన అశోక్ గెహ్లాట్ మొండిగా వ్యవహరించి అధిష్టానం కన్నెర్ర చేసే పరిస్థితి కొని తెచ్చుకున్నారు. తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టినా రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతానంటూ పట్టుబట్టారు. అయితే ఆయన ఆలోచనలకు సోనియా, రాహుల్ చెక్ పెట్టారు. ఒక వ్యక్తికి ఒకే పదవి సూత్రాన్ని అనుసరించాలని సూచించారు. దీంతో చేసేదేమీ లేక రూటు మార్చిన గెహ్లాట్ తాను సూచించే వ్యక్తినే రాజస్థాన్ సీఎంగా చేయాలని మెలిక పెట్టాడు. అంతేకాదు తన వర్గం ఎమ్మెల్యేలందరితో అధిష్టానంపై తిరుగుబాటు చేయించాడు. తమ వర్గం వారే సీఎం కావాలని గెహ్లాట్ వర్గీయులు పట్టుబట్టడంతో అధిష్టానానికి కోపం నషాళానికంటింది. సచిన్ పైలట్‌కు చెక్ పెట్టాలని గెహ్లాట్ చేసిన యత్నాలను సోనియా, రాహుల్ తిప్పికొట్టారు. కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థిగా కూడా పోటీ చేయకుండా గెహ్లాట్‌కు షాకిచ్చిన అధిష్టానం సీఎంగా గెహ్లాట్‌ను కొనసాగించాలా వద్దా అనే విషయం అధ్యక్ష ఎన్నికల తర్వాత తేలుద్దామని స్పష్టం చేసింది. దీంతో గెహ్లాట్‌తో పాటు ఆయన వర్గీయులు కూడా ఇవాళ్టి వరకూ మౌనంగా ఉన్నారు. అయితే ఓ వైపు ఎన్నికలు కొనసాగుతుండగానే గెహ్లాట్ నేరుగా సచిన్ పైలట్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడటం దుమారం రేపుతోంది. 


కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ బుధవారం జరగనుంది. కొత్త అధ్యక్షుడికి కొత్త తలనొప్పి రాజస్థానే కానుంది. గెహ్లాట్‌పై వేటేస్తారా లేక సచిన్ పైలట్‌నే సముదాయిస్తారా అనేది వేచి చూడాల్సిందే. 

Updated Date - 2022-10-17T19:05:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising