ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yogi హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలా వ్యవహరిస్తున్నారు...సీఎంపై విరుచుకుపడిన ఒవైసీ

ABN, First Publish Date - 2022-06-13T18:02:28+05:30

ప్రయాగ్‌రాజ్ నగరంలో బుల్డోజరుతో కూల్చివేతలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో(ఉత్తరప్రదేశ్): ప్రయాగ్‌రాజ్ నగరంలో బుల్డోజరుతో కూల్చివేతలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.యూపీ సీఎం యోగి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలా వ్యవహరిస్తున్నారని అసద్ ఆరోపించారు.ప్రయాగ్‌రాజ్‌లో హింసాకాండకు ప్రధాన సూత్రధారి అయిన జావేద్ మహ్మద్ ఇంటిని కూల్చివేసిన కొన్ని గంటల తర్వాత అసద్ ఈ వ్యాఖ్యలు చేశారు.‘‘యూపీ ముఖ్యమంత్రి  యోగి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. ఎవరినైనా దోషులుగా నిర్ధారిస్తారా? వారి ఇళ్లను కూల్చేస్తారా?’’ అని గుజరాత్‌లోని కచ్‌ నగరంలో ఓ ర్యాలీలో ప్రసంగిస్తూ ఒవైసీ ప్రశ్నించారు.



సహరాన్‌పూర్‌లో అల్లర్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తుల ఇళ్లను కూల్చివేశారు.రాళ్లదాడికి పాల్పడిన ప్రధాన సూత్రధారి జావేద్ అహ్మద్‌ను అరెస్టు చేసినట్లు ప్రయాగ్‌రాజ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజయ్ కుమార్ తెలిపారు.టీవీ చర్చ సందర్భంగా ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను పలు ఇస్లామిక్ దేశాలు ఖండించడంతో ఆమెను బీజేపీ సస్పెండ్ చేసింది.

Updated Date - 2022-06-13T18:02:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising