ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాపై దాడి వెనుక సూత్రధారి ఉన్నారు...Asaduddin సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-02-04T16:22:34+05:30

తనపై దాడి ఘటన వెనుక సూత్రధారుడు ఉన్నారని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తనపై దాడి ఘటన వెనుక సూత్రధారుడు ఉన్నారని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ‘‘నా ప్రాణాలు తీయాలనే విషయంపై కొన్నిరోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ధరమ్ సంసద్‌ సమావేశంలో చర్చ జరిగింది...ఈ విషయం ధర్మసంసద్ రికార్డుల్లో కూడా ఉంది, నాపై దాడి వెనుక ఖచ్చితంగా సూత్రధారి ఉన్నారు,ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కు చెప్పాలనుకుంటున్నాను’’ అని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. గురువారం అసదుద్దీన్ ఒవైసీ మీరట్‌లోని కిథౌర్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమం ముగించుకుని ఢిల్లీకి తిరిగి వస్తుండగా ఈ కాల్పుల ఘటన జరిగింది.ఈ ఘటనలో ఒవైసీ ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. మరోవైపు ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 


ఈ కాల్పుల ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఐదు బృందాలను ఏర్పాటు చేశారు.తాను 1994వ సంవత్సరంలో రాజకీయ జీవితం ప్రారంభించానని, ఎప్పుడూ తాను పోలీసు సెక్యూరిటీ తీసుకోలేదని ఒవైసీ చెప్పారు. తన ప్రాణాలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అసద్ పేర్కొన్నారు.ఎరుపు, తెలుపు రంగు జాకెట్లు ధరించిన ఇద్దరు నిందితులు తన కారుపై కాల్పులు జరిపారని, వారు ఉపయోగించిన తుపాకీ శబ్ధం ఆధారంగా అది దేశంలో తయారు చేసిన తుపాకీ కాదని, 9ఎంఎం పిస్టల్ అని చెప్పారు.ఈ ఘటనపై ప్రధానమంత్రి, యూపీ పాలకులు దర్యాప్తు చేయాలని కోరారు.తాను అసెంబ్లీ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్‌లో ప్రచారాన్ని కొనసాగిస్తానని అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.


Updated Date - 2022-02-04T16:22:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising