ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Arpita Mukherjee: పార్థఛటర్జీతో అర్పితా రిలేషన్‌షిప్ బాగోతం!

ABN, First Publish Date - 2022-09-22T14:53:07+05:30

పశ్చిమబెంగాల్ టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమర్పించిన ఛార్జిషీట్‌లో(ED chargesheet) రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రశ్నించిన ఈడీ...ఆ డబ్బు, బంగారం ఆయనవేనని వెల్లడి

కోల్‌కతా(పశ్చిమబెంగాల్): పశ్చిమబెంగాల్ టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమర్పించిన ఛార్జిషీట్‌లో(ED chargesheet) రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. పశ్చిమ బెంగాల్ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీతో(Partha Chatterjee) అర్పితాముఖర్జీకి(Arpita Mukherjee) ఉన్న వ్యక్తిగత సంబంధాలపై(Relation) కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు. పార్థఛటర్జీ తీసుకున్న బీమా పత్రాల్లో నామినీగా అర్పితా ముఖర్జీ పేరు పెట్టడాన్ని ఈడీ ప్రశ్నించింది.ఎలాంటి రిలేషన్ లేకుండా మాజీమంత్రి తన బీమా పత్రాల్లో అర్పితాముఖర్జీ పేరు ఎలా పెడతారని ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. 


లివింగ్ రిలేషన్‌షిప్‌పై కూడా ఈడీ ప్రశ్నించినా వారికి అర్పితా ముఖర్జీ నుంచి సరైన సమాధానం రాలేదని తెలిసింది. తన రెండు ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న రూ.49.80 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు(cash gold) తనవి కాదని, అవి పార్థఛటర్జీకి చెందినవని అర్పితాముఖర్జీ ఎట్టకేలకు అంగీకరించారు. అర్పితా ముఖర్జీ తన రెండు ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న డబ్బు, బంగారు ఆభరణాల మూలానికి సంబంధించిన వివరాలను వెల్లడించడానికి మొదట నిరాకరించారు. తన ఇంటికి నగదు, నగలు ఎప్పుడు? ఎలా? చేరాయో తనకు తెలియదని కూడా అర్పితా చెప్పింది. 


పదేపదే విచారించిన తరువాత అర్పితా ముఖర్జీ డబ్బు గురించి పెదవి విప్పారు. మంత్రి పార్థఛటర్జీకి చెందిన రెండు ఇళ్ల నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూ.5కోట్లకుపైగా విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుంది.పార్థ ఛటర్జీకి అక్టోబర్ 5వతేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు.ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన చార్జ్ షీట్ కాపీ ప్రకారం అర్పితాముఖర్జీ... పార్థ ఛటర్జీ యొక్క ట్రేడ్ లైసెన్స్‌ని ఉపయోగించి షాపింగ్ మాల్‌లో సభ్యత్వం తీసుకుంది. 2018 సెప్టెంబరు 1వతేదీన పార్థ ఛటర్జీ పేరు మీద మెట్రో క్యాష్ అండ్ క్యారీ కార్డు జారీ అయింది.


Updated Date - 2022-09-22T14:53:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising