ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాడు గర్వపడేలా ఏపీలో పనిచేస్తా: మంత్రి రోజా

ABN, First Publish Date - 2022-04-17T13:02:10+05:30

మెట్టినిల్లయిన తమిళనాడు గర్వపడేలా పుట్టినిల్లయిన ఆంధ్రప్రదేశ్‌లో పనిచే స్తానని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్‌కే రోజా తెలిపారు. ఏపీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: మెట్టినిల్లయిన తమిళనాడు గర్వపడేలా పుట్టినిల్లయిన ఆంధ్రప్రదేశ్‌లో పనిచే స్తానని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్‌కే రోజా తెలిపారు. ఏపీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా శనివారం కాంచీపురం కామాక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చిన రోజా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ.. తమిళనాడు ప్రజలు కూడా తాను మంత్రి కావాలని ప్రార్థించారని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని అన్నారు. తాను ప్రతి ఏడాది కామాక్షి అమ్మవారిని దర్శించుకుంటానని, ఎలాంటి కార్యక్రమమైనా చేపట్టే ముందు అమ్మవారిని దర్శించుకుంటానని తెలిపారు. పిల్లలు పుట్టరని తెలిపిన రోజుల్లో కూడా, కామాక్షి అమ్మవారిని వేడుకోవడంతో తనకు ఇద్దరు పిల్లలు జన్మించారని, దాంతో కామాక్షి అమ్మవారి మీద భక్తి అధికమైందని చెప్పారు. ప్రస్తుతం మంత్రిగా కామాక్షి అమ్మవారిని దర్శించుకొని, కుంకుమార్చన చేసి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందని, తాను మంత్రిని కావాలని పూజలు చేసిన ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని రోజా పేర్కొన్నారు. కాగా ఆలయంలో మంత్రి ఆర్‌కే రోజాను అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి వి.కృష్ణారావు కలిశారు. స్మారక భవన నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని విన్నవించారు.



Updated Date - 2022-04-17T13:02:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising