మలేషియా ప్రధానిగా అన్వర్ ఇబ్రహీం ప్రమాణం
ABN, First Publish Date - 2022-11-25T03:55:04+05:30
మలేషియా ప్రతిపక్ష నేత అన్వర్ ఇబ్రహీం (75) ఎట్టకేలకు ఆ దేశ ప్రధానమంత్రి అయ్యారు. మలేషియా రాజు సుల్తాన్ అబ్దుల్లా
కౌలాలంపూర్, నవంబరు 24: మలేషియా ప్రతిపక్ష నేత అన్వర్ ఇబ్రహీం (75) ఎట్టకేలకు ఆ దేశ ప్రధానమంత్రి అయ్యారు. మలేషియా రాజు సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా సమక్షంలో గురువారం ప్రధానిగా ప్రమాణం చేశారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు అంశంలో కొద్దిరోజులుగా నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. శనివారం వెలువడిన సాధారణ ఎన్నికల ఫలితాల్లో బరిలో నిలిచిన ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించలేదు. యునైటెడ్ మలేయస్ నేషనల్ ఆర్గనైజేషన్‌తో పొత్తు పెట్టుకున్న అన్వర్ అధికారాన్ని దక్కించుకున్నారు. దేశ చరిత్రలో తొలిసారి హంగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
Updated Date - 2022-11-25T03:55:05+05:30 IST