ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anthill: దిండుగల్‌ జిల్లాలో చీమల బెడద !

ABN, First Publish Date - 2022-08-19T16:44:25+05:30

దిండుగల్‌ జిల్లాలోని కొండ ప్రాంతానికి చేరువుగా ఉన్న ఏడు గ్రామాల ప్రజలు వింత చీమలతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పపువా న్యూగునియా,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): దిండుగల్‌ జిల్లాలోని కొండ ప్రాంతానికి చేరువుగా ఉన్న ఏడు గ్రామాల ప్రజలు వింత చీమలతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పపువా న్యూగునియా, మారిషష్‌(Mauritius) తదితర దేశాల్లో మాత్రమే కనిపించే ఈ చీమలు.. ఆ ఏడుగ్రామాల్లో సంచరిస్తుండడం స్థానికులకు అర్థం కావడం లేదు. ఆ చీమలదండు దాడికి గురవుతున్న తమ పశువులు.. కంటి చూపును కోల్పోతున్నాయని, కోళ్ళు మృతి చెందుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. నోప్లోలిప్స్‌ గ్రేసిలిప్స్‌ అనే సాంకేతిక నామం కలిగిన ఆ పసుపు చీమలు వందరకాల హానికలిగించే వాటిలో ఒకటని ఐయూసీఎన్‌ సంస్థ ప్రకటించింది. దిండుగల్‌ జిల్లా కరాందమలై  పక్కనున్న అటవీ ప్రాంతాల నుండి వస్తున్న ఆ చీమలు తమ శరీరంపై పాకితే మంటలు, బొబ్బలు ఏర్పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాగేందుకు నీళ్లు(water) తీసుకున్నా, అందులోనూ ఆ చీమలు కనిపిస్తుండటంతో వాటిని అరికట్టడమెలాగో తెలియక సతమతమవుతున్నామన్నారు.

Updated Date - 2022-08-19T16:44:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising