ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అఖిలేశ్ యాదవ్‌కు మరో షాక్... బీజేపీలో చేరిన ములాయం సింగ్ సమీప బంధువు...

ABN, First Publish Date - 2022-01-20T20:59:23+05:30

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సమీప బంధువు  ప్రమోద్ గుప్తా గురువారం బీజేపీలో చేరారు. ములాయం చిన్న కోడలు అపర్ణ యాదవ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్న మర్నాడే ఆమె బాటలో ప్రమోద్ నడిచారు. 


ప్రమోద్ మాట్లాడుతూ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తన తండ్రి ములాయం సింగ్ యాదవ్‌ను గృహ నిర్బంధం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం పార్టీలో తన పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. నేరగాళ్ళు, జూదగాళ్ళను సమాజ్‌వాదీ పార్టీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. 


ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. బీజేపీ 107 మంది అభ్యర్థులతో తొలి జాబితాను శనివారం విడుదల చేసింది. వీరిలో 44 మంది ఓబీసీలు, 43 మంది అగ్ర వర్ణాలకు చెందినవారు, 19 మంది ఎస్సీలు ఉన్నారు. 


Updated Date - 2022-01-20T20:59:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising