ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్‌లో ప్రాణాలు కోల్పోయిన మరో భారతీయ విద్యార్థి

ABN, First Publish Date - 2022-03-02T22:59:46+05:30

యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మరో భారతీయ విద్యార్థి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీవ్ : యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మరో భారతీయ విద్యార్థి చందన్ జిందాల్ (22) బుధవారం ప్రాణాలు కోల్పోయారు. ఆయన పంజాబ్‌లోని బర్నాలాకు చెందినవారని, వినిట్సియాలోని నేషనల్ పైరోగోవ్ మెమోరియల్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నారని తెలుస్తోంది. ఫిబ్రవరి 24న రష్యా దాడులు ప్రారంభమైన తర్వాత ప్రాణాలు కోల్పోయిన మొదటి విద్యార్థి కర్ణాటకకు చెందిన నవీన్ అనే సంగతి తెలిసిందే. 


మీడియా కథనాల ప్రకారం, ఇషెమిక్ స్ట్రోక్‌తో బాధపడుతున్న జిందాల్‌ను వినిట్సియాలోని కీవ్‌స్కా వీథి-68లో ఉన్న ఎమర్జెన్సీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలిసిన ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపిస్తున్నారు. ఆయన తండ్రి భారత ప్రభుత్వానికి రాసిన లేఖలో తమ కుమారుని మృతదేహాన్ని రప్పించేందుకు సాయం చేయాలని కోరారు. 


కర్ణాటకకు చెందిన నవీన్ శేఖరప్ప మంగళవారం ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో జరిగిన పేలుళ్ళలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతదేహాన్ని రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ గగనతలంలో ప్రయాణికుల విమానాల రాకపోకలపై నిషేధం అమలవుతోంది. కాబట్టి మృతదేహాలను తీసుకురావడానికి ఇతర మార్గాలను అన్వేషించవలసి ఉంటుంది. 


ఇషెమిక్ స్ట్రోక్ వచ్చినపుడు మెదడుకు ఆక్సిజన్, న్యూట్రియెంట్స్ సక్రమంగా అందవు. క్షణాల్లోనే బ్రెయిన్ సెల్స్ మరణిస్తాయి. దీనికి సరైన, అత్యవసర చికిత్స తప్పనిసరి. సాధ్యమైనంత త్వరగా చికిత్స అందితే మెదడుకు జరిగే నష్టాన్ని తగ్గించవచ్చు. 


Updated Date - 2022-03-02T22:59:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising