ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు.. రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా..

ABN, First Publish Date - 2022-05-01T03:18:12+05:30

చెన్నై: తమిళనాడులోని హొసూర్‌లో మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు చెలరేగాయి. రోడ్డుపై వెళ్తుండగా స్కూటర్ సీటు కింద నుంచి అకస్మాత్తుగా మంటలు వచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తమిళనాడులోని హొసూర్‌లో మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు చెలరేగాయి. రోడ్డుపై వెళ్తుండగా స్కూటర్ సీటు కింద నుంచి అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. ఈ ప్రమాదంలో స్కూటర్ వెనుక భాగం దాదాపు కాలిపోయింది. ఒక్కసారిగా మంటలు రావడాన్ని గుర్తించిన యజమాని సతీష్ కుమార్ వేగంగా స్పందించి తప్పించుకోగలిగాడు. మంటలు గుర్తించిన వెంటనే స్కూటర్‌ను ఆపివేసి పక్కకు పరిగెత్తాడు. దీంతో ఎలాంటి హానికలగకుండానే బయటపడ్డాడు. రోడ్డుపై వెళ్తున్నవారు మంటలను ఆర్పేందుకు  సాయం చేసినా ఫలితం దక్కలేదు. స్కూటర్ వెనుక లోపలి భాగం పూర్తిగా కాలిపోయింది. గతేడాది ఈ స్కూటర్‌ను కొనుగోలు చేశానని సతీష్ చెప్పాడు. 


కాగా ఇటివల ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగడం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. మార్చి నెలలో తమిళనాడులోని వెల్లూర్ జిల్లాలో ఇదే తరహా విషాద ఘటన జరిగింది. ఛార్జింగ్ పెడుతున్న సమయంలో స్కూటర్‌లో పేలుడు సంభవించింది. ఈ  ప్రమాదంలో తండ్రి, కూతురు చనిపోయారు. తిరుచిరప్పలి జిల్లాలో కూడా ఇదే తరహా మరో ఘటన జరిగింది. మరోవైపు తెలంగాణలోనూ ఇటివల ఛార్జింగ్ పెడుతున్న సమయంలో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-05-01T03:18:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising