ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమాలతోనే Dmk గెలుపు

ABN, First Publish Date - 2022-02-23T13:36:59+05:30

రాష్ట్రంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు 20 యేళ్లనాటి బీహార్‌ పరిస్థితులను తలపించే విధంగా ఉన్నాయని, ఈ ఎన్నికల్లో అధికార డీఎంకే అవినీతి, అక్రమాలతోనే గెలిచిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                    - Bjp రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై  


చెన్నై: రాష్ట్రంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు 20 యేళ్లనాటి బీహార్‌ పరిస్థితులను తలపించే విధంగా ఉన్నాయని, ఈ ఎన్నికల్లో అధికార డీఎంకే అవినీతి, అక్రమాలతోనే గెలిచిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విమర్శించారు. టి.నగర్‌లోని పార్టీ కార్యాలయం కమలాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చెన్నై నుంచి కన్నియాకుమారి వరకూ ఈ ఎన్నికల్లో డీఎంకే సాగించిన అక్రమాలను, పోలింగ్‌ కేంద్రాల ఎదుటే ఓటర్లకు భారీగా నగదు పంపిణీ చేయడాన్ని ప్రజలందరూ గమనించారని చెప్పారు. కరోనా బాధితులు ఓటు వేయడానికి కేటాయించిన సమయం డీఎంకే నేతలు, కార్య కర్తలు పోలింగ్‌ కేంద్రాలలో చొరబడి భారీగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, ఆ సమయంలో పోలింగ్‌ కేంద్రాలలోని సీసీటీవీ కెమెరాలను పనిచేయకుండా చేశారని ఆయన ఆరోపించారు. పలు చోట్ల తమ అక్రమాలు బయట పడతాయనే భయంతో కాపలా కాస్తున్న పోలీసులను, పాత్రికేయులను డీఎంకే నేతలు తరిమికొట్టారని ఆరోపించారు. తిరువణ్ణామలై, మదురై, కన్నియాకుమారి, తిరునల్వేలి తదితర ప్రాంతాల్లో బీజేపీ నేతలు, అభ్యర్థుల పై కూడా దాడికి పాల్పడ్డారని, చెన్నై, కోవై కార్పొరేషన్లలో భారీ యెత్తున హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయని చెప్పారు. బీహార్‌లో 20 ఏళ్ల క్రితం జరిగినట్లు డీఎంకే నేతలు, కార్యకర్తలు, ఏజెంట్లు పోలింగ్‌ కేంద్రాలను స్వాధీనం చేసుకుని నకిలీ ఓట్లు వేశారని ఆయన విమర్శించారు. ఇంత జరిగినా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర పోషించిందని ఆరోపించారు. మదురై మేలూరు మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన ముస్లిం యువతి ముఖం కనిపించకపోవడంతో హిజాబ్‌ను తెరవమన్న బీజేపీ ఏజెంటును అరెస్టు చేయించి, తమ పార్టీ అక్రమాలకు పాల్పడినట్లు ఎన్నికల సంఘం ఆ సంఘటనను వక్రీకరించిందని అన్నామలై ఆగ్రహంవ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని డీజేపీ, ఎన్నికల అధికారి ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. అధికార డీఎంకే పార్టీ అక్రమాలకు పాల్పడినా కొన్ని చోట్ల తమ పార్టీ సభ్యులు కౌన్సిలర్లు గెలుపొందటం తమకు సంతృప్తిని కలిగించిందని చెప్పారు. ఈ ఎన్నికల అక్రమాలపై కోర్టులో కేసు వేస్తామని కూడా అన్నామలై హెచ్చరించారు.

Updated Date - 2022-02-23T13:36:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising