ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంజనాద్రే హనుమాన్‌ జన్మస్థలం

ABN, First Publish Date - 2022-06-10T16:44:12+05:30

అంజనీ పుత్రుడు హనుమంతుడు జన్మ స్థానంపై వివాదానికి తెర దించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకోనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                        - 15న సీఎం అధ్యక్షతన కీలక సమావేశం 


బెంగళూరు, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): అంజనీ పుత్రుడు హనుమంతుడు జన్మ స్థానంపై వివాదానికి తెర దించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకోనున్నారు. అంజనాద్రి ప్రాంతమే హనుమాన్‌ జన్మస్థలమని పలు పౌరాణిక గ్రంథాలు వెల్లడిస్తున్నాయని కొప్పళ జిల్లా గంగావతి ఎమ్మెల్యే పరణ్ణ మునవళ్ళి వెల్లడించారు. ఈ మేరకు ఆయన బెంగళూరులో గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 15, 16 తేదీలలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అధ్యక్షతన జరిగే సమావేశంలో అంజనాద్రి పర్వత ప్రాంతాల అభివృద్ధితోపాటు హనుమాన్‌ జన్మస్థలంపై కూడా చర్చ జరుపుతామన్నారు. హనుమాన్‌ జన్మస్థలానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో టీటీడీ, మహారాష్ట్రలోని నాసిక్‌ అంజనేరి కొండలు, గోవాలోని పణజీ ప్రాంతానికి చెందిన కొందరు పలు ప్రతిపాదనలు తెరపైకి తెచ్చారన్నారు. ఈ గందరగోళానికి తెరదించేందుకు ఆధ్యాత్మికంగా, చారిత్రాత్మకంగా మరింతలోతుగా ఈ అంశంపై లోతుగా అధ్యయనం చేయాలని ప్రభుత్వానికి సూచిస్తామన్నారు. అయితే భక్తులు కూడా హ నుమంతుడి జన్మ వృత్తాంతంపై వివాదం తగదని, ఈ సమస్యకు త్వరగా తెరదించాలని కోరుకుంటున్నారు. 

Updated Date - 2022-06-10T16:44:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising