ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IndiGo Plane Troubles: అస్సాంలో బురదలో కూరుకుపోయిన విమానం

ABN, First Publish Date - 2022-07-29T17:11:56+05:30

అస్సాం (Assam)లోని జోర్హాట్ (Jorhat) విమానాశ్రయంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గువాహటి : అస్సాం (Assam)లోని జోర్హాట్ (Jorhat) విమానాశ్రయంలో ఓ విమానం రన్‌వేపై నుంచి జారిపోయింది. రెండు చక్రాలు బురదలో కూరుకుపోయాయి. దీంతో గురువారం జోర్హాట్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా (Kolkata)కు వెళ్లవలసిన ఈ విమానం సర్వీసును రద్దు చేశారు. 


ఇండిగో (Indigo) ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఇండిగో 6ఈ-757 విమానం జోర్హాట్ నుంచి బయల్దేరుతుండగా, రన్‌వేపై జారిపోయింది. రెండు చక్రాలు గడ్డితో కూడిన మైదానంలో కూరుకుపోయాయి. ఈ విమానం కోల్‌కతా (Kolkata) వెళ్ళవలసి ఉంది. 


స్థానిక విలేకరి ఈ దృశ్యాన్ని ట్వీట్ చేశారు. ‘‘గువాహటి-కోల్‌కతా ఇండిగో విమానం 6ఎఫ్ 757 అస్సాంలోని జోర్హాట్ విమానాశ్రయం రన్‌వేపై జారిపోయింది, బురద నేలలో కూరుకుపోయింది. ఈ విమానం మధ్యాహ్నం 2.20 గంటలకు బయల్దేరవలసి ఉంది, కానీ ఈ సంఘటనల వల్ల ఆలస్యమవుతోంది’’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను ఇండిగోకు ట్యాగ్ చేశారు. 


ఇండిగో స్పందిస్తూ, ఈ వార్త వినడం తమకు బాధాకరంగా ఉందని తెలిపింది. సంబంధిత బృందంతో మాట్లాడతామని చెప్పింది. డీఎం ద్వారా పీఎన్ఆర్‌ను షేర్ చేయాలని కోరింది. 


భారత విమానాశ్రయాల సంస్థ (AAI) అధికారులు మాట్లాడుతూ, ఈ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడిందని, గురువారం రాత్రి 8.15 గంటలకు ఈ విమానం సర్వీసును రద్దు చేశారని తెలిపారు. దీనిలో ప్రయాణిస్తున్న 98 మంది ప్రయాణికులు సురక్షితంగా దిగిపోయారని, వారంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు. 




Updated Date - 2022-07-29T17:11:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising