ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.500 కోట్ల విలువైన మరకత శివలింగం స్వాధీనం

ABN, First Publish Date - 2022-01-01T17:31:22+05:30

తమిళనాడులోని తంజావూరులో ఓ వ్యక్తి బ్యాంకు లాకర్ నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : తమిళనాడులోని తంజావూరులో ఓ వ్యక్తి బ్యాంకు లాకర్ నుంచి రూ.500 కోట్ల విలువైన మరకత శివ లింగాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏడీజీపీ కే జయంత్ మురళి చెప్పారు. తంజావూరులోని ఓ ఇంట్లో పురాతన విగ్రహాలు ఉన్నట్లు సమాచారం రావడంతో తనిఖీలు చేసి, ఈ వ్యక్తిని గురువారం అరెస్టు చేసినట్లు శుక్రవారం విలేకర్ల సమావేశంలో చెప్పారు. 


అదనపు పోలీసు సూపరింటెండెంట్లు ఆర్ రాజారామ్, పి అశోక్ నటరాజన్ నేతృత్వంలోని బృందం ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. తంజావూరులోని అరులనంద నగర్‌, సెవెన్త్ క్రాస్, లంగ్వల్ హోమ్స్‌లో ఎన్ఎస్ అరుణ్‌‌‌‌ని ప్రశ్నించినట్లు తెలిపారు. తన తండ్రి తంజావూరులోని బ్యాంకు లాకర్‌లో ఓ పురాతన శివలింగాన్ని ఉంచినట్లు అరుణ్ చెప్పారని, ఆ తర్వాత దానిని దర్యాప్తు కోసం తమకు అందజేశారని తెలిపారు. 


ఈ శివలింగం బరువు 530 గ్రాముల ఉందని, ఎత్తు 8 సెంటీమీటర్లు ఉందని తెలిపారు. దీని విలువ రూ.500 కోట్లు వరకు ఉంటుందని జెమాలజిస్టులు చెప్పారన్నారు. తన తండ్రి సామియప్పన్‌కు ఈ శివలింగం ఎలా వచ్చిందో తనకు తెలియదని చెప్పారని పేర్కొన్నారు. ధర్మపురం ఆధీనం వంటి కస్టోడియన్ల చేత దీనిని తనిఖీ చేయించామని, ఇది అసలైన మరకత శివలింగమేనని చెప్పారని తెలిపారు. సైంటిఫిక్ అనాలసిస్ చేసి, ఈ శివలింగం ఏ దేవాలయానికి చెందినదో తెలుసుకుంటామని చెప్పారు. 2016లో నాగపట్టణం జిల్లాలోని తిరుకువలై శివాలయంలో దొంగతనానికి గురైనది ఈ శివలింగమేనా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు. 


Updated Date - 2022-01-01T17:31:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising