ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amrapali group: అనిల్ శర్మ బెయిలు దరఖాస్తు... ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు...

ABN, First Publish Date - 2022-08-04T22:28:56+05:30

అమ్రపాలి గ్రూప్ (Amrapali Group) వ్యవస్థాపకుడు అనిల్ కుమార్ శర్మ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : అమ్రపాలి గ్రూప్ (Amrapali Group) వ్యవస్థాపకుడు అనిల్ కుమార్ శర్మ (Anil Kumar Sharma) అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ దాఖలు చేసిన బెయిలు దరఖాస్తుపై స్పందించాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం నోటీసు ఇచ్చింది. ఆయన ఆరోగ్య పరిస్థితులపై నివేదిక సమర్పించాలని, తదుపరి విచారణ ఆగస్టు 8న జరుగుతుందని తెలిపింది. జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నోటీసు ఇచ్చింది. 


ఇళ్ల కొనుగోలుదారులు చెల్లించిన సొమ్మును ఇతర అవసరాల కోసం మళ్ళించారనే ఆరోపణలపై నమోదైన అనేక కేసుల్లో  అనిల్ కుమార్ శర్మ సహా అమ్రపాలి గ్రూప్ మాజీ డైరెక్టర్లు జైలు జీవితం గడుపుతున్నారు. ఈ కేసులపై వేర్వేరు దర్యాప్తు సంస్థలు దర్యాప్తు జరుపుతున్నాయి. నిర్మాణం నిలిచిపోయిన రెండు అమ్రపాలి హౌసింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వ యాజమాన్యంలోని జాతీయ భవనాల నిర్మాణ సంస్థ (NBCC)కి సుప్రీంకోర్టు 2019 జనవరి 25న అనుమతి ఇచ్చింది. నోయిడా, గ్రేటర్ నోయిడాలలోని అమ్రపాలి ప్రాజెక్టులలో అసంపూర్ణంగా ఉన్న హౌసింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి, సంబంధిత గృహ కొనుగోలుదారులకు సాధ్యమైనంత త్వరగా అప్పగించాలని ఎన్‌బీసీసీని కోరింది. అమ్రపాలి గ్రూప్ RERA (Real Estate Regulatory Authority) రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. 


Updated Date - 2022-08-04T22:28:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising