ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమిత్‌షా రహస్య సర్వే

ABN, First Publish Date - 2022-05-24T17:46:56+05:30

రాష్ట్ర శాసనసభ ఎన్నికలు వచ్చే ఏడాది రానున్న నేపథ్యంలో కేం ద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రాష్ట్రంలోని సిట్టింగ్‌ బీజేపీ ఎమ్మెల్యేలపై సమగ్ర సర్వే జరిపించినట్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                - 30 మంది సిట్టింగ్‌లకు భవిష్యత్తు కష్టమే..!


బెంగళూరు: రాష్ట్ర శాసనసభ ఎన్నికలు వచ్చే ఏడాది రానున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రాష్ట్రంలోని సిట్టింగ్‌ బీజేపీ ఎమ్మెల్యేలపై సమగ్ర సర్వే జరిపించినట్టు తెలుస్తోంది. 30 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వారు మరోసారి గెలుపొందే అవకాశాలు అంతంత మాత్రమేనని సర్వే తేల్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అమిత్‌ షా చేతికి చేరిన సర్వే నివేదికను అమలు చేస్తే 30 మంది సిట్టింగ్‌లకు టికెట్లు దక్కవని సమాచారం. రాష్ట్ర బీజేపీలో ఈ అంశం హల్‌చల్‌ చేస్తోంది. ఓ ప్రైవేట్‌ ఏజెన్సీకి చెందిన 150 మంది ప్ర తినిధులు మే 1 నుంచి 15వ తేదీ వరకు ప్రతి శాసనసభ నియోజకవర్గంలోనూ పర్యటించి అత్యంత రహస్యంగా నివేదికను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. గడిచిన పదేళ్లలో బీజేపీ వర్ఛస్సు దేశమంతటా వెలిగింది. దక్షిణభారత్‌లో బీజేపీకి అవకాశం ఉండేది ఏకైక రాష్ట్రం కర్ణాటకనే. శాసనసభ ఎన్నికల ద్వారా విజయం సాధించి, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు పునాది వేసుకోవాలని భావిస్తున్నారు. ఇలా ఓటమి తప్పదనే అభ్యర్థులను పక్కనపెట్టి కొత్తవారిపట్ల మరోసర్వే జరిపించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుత సర్వే ప్రకారం 30 మంది సిట్టింగ్‌లకు టికెట్‌లు దక్కవనేది స్పష్టమవుతోంది. 

Updated Date - 2022-05-24T17:46:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising