ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాహుల్ గాంధీ Italilian కళ్లద్దాలు తీసి చూడాలి: Amit shah

ABN, First Publish Date - 2022-05-22T21:06:35+05:30

ఇటానగర్: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విసుర్లు విసిరారు. వయనాడ్ ఎంపీ తన ఇటాలియన్ కళ్లద్దాలు తీసి చూస్తే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటానగర్: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul gandhi)పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) విసుర్లు విసిరారు. వయనాడ్ ఎంపీ తన ఇటాలియన్ కళ్లద్దాలు (Italian glasses) తీసి చూస్తే అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra modi), ముఖ్యమంత్రి పెమ ఖండూ (Pema Khandu) చేసిన అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు. నమ్‌సాయి జిల్లాలోని రూ.1000 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన సందర్భంగా అమిత్‌షా మాట్లాడారు. ఎనిమిదేళ్లలో ఏమి చేశారని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారని, వీళ్లంతా మూసుకున్న కళ్లను తెరిచి చూడాలని హితవు పలికారు. రాహుల్ గాంధీ ఇటాలియన్ కళ్లద్దాలు ఒకసారి తీసి చూస్తే ప్రధాని మోదీ, సీఎం పెమా ఖండూ చేసిన అభివృద్ధి కనిపిస్తుందన్నారు.


''మౌలిక వసతుల కల్పన, శాంతి భద్రత పటిష్టత, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో సహా ఎనిమిదేళ్లలో ఎన్నో అభివృద్ధి  పనులు చేశాం. 50 ఏళ్లలో చేయలేని పనిని మోదీ, పెమా ఖండూ కలిసి ఎనిమిదేళ్లలో చేసి చూపించారు'' అని అమిత్‌షా అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన అరుణాచల్ ప్రదేశ్ వచ్చారు. నమసాయ్ జిల్లాలోని గోల్డెన్ పగోడాను ఆదివారం ఉదయం సందర్శించారు. ఆయనతో పెమా ఖండూ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా పాల్గొన్నారు. తన పర్యటనలో భాగంగా నమసాయిలో ఆర్మీ, ఇండో-టిబిటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సర్వీసెస్ సెక్షన్ బోర్డ్ (ఎస్ఎస్‌బీ), అసోం రైఫిల్స్,  బోర్డర్ రోడ్ ఆర్గనైజేష్, నేషనల్ హైవేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్ఐడీఎల్‌సీ) సిబ్బందిని కలుసుకుని భద్రత, అభివృద్ధిని అమిత్‌షా సమీక్షిస్తారు.

Updated Date - 2022-05-22T21:06:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising