ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Covid : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఎలా?

ABN, First Publish Date - 2022-01-12T19:21:46+05:30

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు లోక్‌సభ, రాజ్యసభలలో షిఫ్ట్‌లవారీగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు లోక్‌సభ, రాజ్యసభలలో షిఫ్ట్‌లవారీగా జరగబోతున్నాయి. కోవిడ్-19 మహమ్మారి కేసులు పెరుగుతుండటంతోపాటు పార్లమెంటు సిబ్బంది దాదాపు 400 మంది ఈ వ్యాధి బాధితులు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ ఈ వివరాలను బుధవారం వెల్లడించింది. 


దేశవ్యాప్తంగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను లోక్‌సభ, రాజ్యసభలలో షిఫ్టులవారీగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు చెప్పినట్లు ఆ వార్తా సంస్థ తెలిపింది. కోవిడ్ ప్రోటోకాల్‌ను కఠినంగా అమలు చేయవలసిన అవసరం ఉందని ఆ వర్గాలు చెప్పినట్లు తెలిపింది. 


జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలి దశ ప్రారంభమయ్యే అవకాశం ఉందని, ఈ సమావేశాలను రాజ్యసభ, లోక్‌సభలలో షిఫ్టులవారీగా నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిందని తెలిపింది. ఈ సమావేశాలు దాదాపు 15 రోజులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదిస్తే, బడ్జెట్‌ను ప్రవేశపెట్టే రోజు మినహా, మిగతా రోజుల్లో రాజ్యసభ సమావేశాలు ఉదయం 9 గంటల  నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు; లోక్‌సభ సమావేశాలు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతాయి. బడ్జెట్‌ను ప్రవేశపెట్టే రోజున లోక్‌సభ సమావేశాలు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతాయి. 


Updated Date - 2022-01-12T19:21:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising