ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Covid కట్టడికి ఐదు అంచెల వ్యూహం...5 రాష్ట్రాలకు కేంద్రం లేఖ

ABN, First Publish Date - 2022-04-20T14:01:10+05:30

కొవిడ్-19 కేసుల వ్యాప్తితో నాల్గవ కరోనా వేవ్ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఐదు రాష్ట్రాలకు లేఖలు రాసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కొవిడ్-19 కేసుల వ్యాప్తితో నాల్గవ కరోనా వేవ్ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఐదు రాష్ట్రాలకు లేఖలు రాసింది.హర్యానా, ఉత్తరప్రదేశ్, మిజోరం, మహారాష్ట్ర, ఢిల్లీలలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు సత్వర, సమర్థవంతమైన నిర్వహణ చర్యలను చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాలకు సూచించింది.రద్దీగా ఉన్న ప్రాంతాల్లో మాస్కులు ధరించడం, టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కొవిడ్ మార్గదర్శకాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలను కోరారు.కరోనా కట్టడికి ఐదు అంచెల వ్యూహాన్ని అమలు చేయాలని కోరారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి రాష్ట్రాలు కఠినమైన పర్యవేక్షణ చేయాలని కార్యదర్శి సూచించారు. కరోనా ప్రబలకుండా అన్ని రకాల ముందుజాగ్రత్తలు తీసుకోవాలని రాజేష్ రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. 


Updated Date - 2022-04-20T14:01:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising