ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

America-India : అమెరికా చట్టాల్లో మితిమీరిన స్వేచ్ఛ... భారత్ కట్టుదిట్టం చేయాలి : పి చిదంబరం

ABN, First Publish Date - 2022-05-26T15:05:36+05:30

అమెరికా (America)లో ఇటీవల 19 మంది చిన్నారులను దారుణంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : అమెరికా (America)లో ఇటీవల 19 మంది చిన్నారులను దారుణంగా కాల్చి చంపడాన్ని కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత పి చిదంబరం (P. Chidambaram) తీవ్రంగా ఖండించారు. అమెరికా చట్టాలు మితిమీరిన స్వేచ్ఛనిస్తున్నాయని, మన దేశంలో విద్వేష ప్రసంగాలు పెరుగుతున్న నేపథ్యంలో చట్టాలను కఠినతరం చేయాలని పిలుపునిచ్చారు. 


అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న రాబ్ ప్రాథమిక పాఠశాలలోకి స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం 18 ఏళ్ళ వయసుగల దుండగుడు ప్రవేశించి, విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో దాదాపు 19 మంది నాలుగో తరగతి విద్యార్థులు, ఇద్దరు టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ, ఇటువంటి సంఘటనలు ఇతర చోట్ల చాలా అరుదు అని చెప్పారు. ఈ దాడి నేపథ్యంలో గన్ కంట్రోల్ (Gun Control) చర్యలు పటిష్టం చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ దుండగుడు అంతకుముందు తన అమ్మమ్మను కూడా కాల్చి చంపేశాడు. చివరికి పోలీసులు ఆ దుండగుడిని కాల్చి చంపేశారు.


పి చిదంబరం గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, టెక్సాస్‌లోని ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న 19 మంది అత్యంత భయానకంగా హత్యకు గురికావడాన్ని ఖండించడానికి మాటలు లేవని చెప్పారు. అమెరికన్లు, బాధిత కుటుంబాలకు యావత్తు ప్రపంచం సానుభూతి తెలుపుతోందని, దుఃఖిస్తోందని తెలిపారు. 


తుపాకీ లైసెన్సుల మంజూరుకు సంబంధించిన నియంత్రణలను పటిష్టపరచడం, తీవ్రమైన గన్ కంట్రోల్స్‌ను విధించడం చాలా అవసరమని తెలిపారు. తుపాకీని కొనడానికి లేదా కలిగియుండటానికి అర్హతలను కఠినతరం చేయాలన్నారు. అమెరికన్ చట్టాలు మితిమీరిన స్వేచ్ఛను ఇస్తున్నాయని, అవి బలహీనంగా ఉన్నాయని తెలిపారు. తుపాకీ వంటి ఆయుధాలను సంపాదించడానికి, కలిగియుండటానికి సంబంధించిన చట్టాలను మన దేశంలో కూడా సమీక్షించి, కఠినతరం చేయాలని కోరారు. విద్వేష ప్రసంగాలు (Hate Speech), విద్వేష హత్యలు (Hate Killings) పెరుగుతున్నందువల్ల ఈ పిచ్చి యావత్తు ప్రపంచాన్ని ముంచేయకుండా ఆపడానికి అన్ని అవకాశాలను తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు. 





Updated Date - 2022-05-26T15:05:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising