ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

cloud burst అనంతరం Amarnath Yatra పునర్ ప్రారంభం

ABN, First Publish Date - 2022-07-11T13:05:26+05:30

వరదలు వెల్లువెత్తడంతో 16 మంది మృతి చెందిన ఘటనతో పాక్షికంగా నిలిపివేసిన అమర్‌నాథ్ యాత్ర సోమవారం ఉదయం తిరిగి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మూ(జమ్మూకశ్మీర్):పవిత్ర గుహ సమీపంలో కుంభవృష్టి అనంతరం వరదలు వెల్లువెత్తడంతో 16 మంది మృతి చెందిన ఘటనతో పాక్షికంగా నిలిపివేసిన అమర్‌నాథ్ యాత్ర సోమవారం ఉదయం తిరిగి ప్రారంభమైంది. కుంభవృష్టి కారణంగా దక్షిణ కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌(Amarnath) గుహ సమీపంలో వరదలు సంభవించిన మూడు రోజుల తర్వాత యాత్ర ఆరంభమైంది.‘‘మేం బాబా దర్శనం లేకుండా తిరిగి వెళ్లలేం. మాకు భోలే బాబాపై పూర్తి విశ్వాసం ఉంది,బాబా దర్శనం కోసం ఎదురు చూస్తున్నాం. యాత్ర తిరిగి ప్రారంభమైనందుకు మేం సంతోషిస్తున్నాము. సీఆర్‌పీఎఫ్ ఇతర సిబ్బంది మార్గనిర్దేశం చేశారు. క్షేమంగా ముందుకు సాగుతున్నాం’’ అని అమరనాథ్ యాత్రికులు చెప్పారు. 


బాల్తాల్ బేస్ క్యాంపు వద్ద యాత్రికులు యాత్రను పునర్ ప్రారంభించారు.శుక్రవారం అమర్‌నాథ్ గుహ పుణ్యక్షేత్రం సమీపంలో వరదలు సంభవించిన కారణంగా 16 మంది మరణించారు.మరో 36 మంది మంది తప్పిపోయారు. భారత వాయుసేన, చీటల్ హెలికాప్టర్ల ద్వారా గాయపడిన మరో 34 మంది యాత్రికులను ఆసుపత్రికి తరలించారు.జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జి) మనోజ్ సిన్హా ఆదివారం పహల్గామ్‌లోని బేస్ క్యాంపును సందర్శించి యాత్రికులను కలిశారు.వరదలతో దెబ్బతిన్న రోడ్డు మార్గానికి మరమ్మతులు చేశారు. జమ్మూ వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి తాము రెస్క్యూ పరికరాలను ఉపయోగిస్తున్నామని భారత సైన్యం తెలియజేసింది.




Updated Date - 2022-07-11T13:05:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising