ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరీందర్ సింగ్ ఓ ద్రోహి.. పార్టీ నుంచి విసిరిపడేయండి: నవజోత్ సింగ్ సిద్ధూ

ABN, First Publish Date - 2022-01-05T00:25:46+05:30

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌పై కాంగ్రెస్ పార్టీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌పై కాంగ్రెస్ పార్టీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ప్రత్యర్థి పార్టీ తోలుబొమ్మని, కాబట్టి ‘కెప్టెన్’ను పార్టీ నుంచి బయటకు విసిరేయాలని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.


రాష్ట్ర బడ్జెట్ రూ. 140 కోట్లని, రూ. 75 కోట్ల రుణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ రుణాలకు రూ. 25 వేల కోట్ల వడ్డీ ఉందన్నారు. ఈ ఏడాది జూన్‌లో రూ.18 వేల కోట్లకు గడువు ముగుస్తుందని తెలిపారు. సిద్ధాంతాలను అమ్మేసుకున్న వ్యక్తి అమరీందర్ సింగ్ అని సిద్ధూ దుబయ్యబట్టారు. మూసుకున్న తలుపుల వెనకాల ఎన్ని రోజులని దాక్కుంటారని ప్రశ్నించారు.


పంజాబ్‌లో బీజేపీ ఎంతమాత్రమూ విజయం సాధించలేదని తేల్చి చెప్పిన సిద్ధూ.. పంజాబ్ సామాజిక, ఆర్థిక వ్యవస్థ పంజాబియత్‌తో ముడిపడి ఉందన్నారు. సిద్ధూ ఇప్పటి వరకు ఆరుసార్లు విజయం సాధించాడని తన గురించి తను చెప్పుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పైనా సిద్ధూ నిప్పులు చెరిగారు. 18 ఏళ్ల వారికి కేజ్రీవాల్ రూ. 1000 ఇస్తామంటున్నారని, మరి 17 ఏళ్ల వారికి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఈ హామీ ఎన్నికల స్టంట్‌లో భాగమని సిద్ధూ విమర్శించారు.   

Updated Date - 2022-01-05T00:25:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising