ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

All India Telugu Federation: కలిసి పోరాడితేనే లక్ష్యాన్ని సాధించగలం

ABN, First Publish Date - 2022-07-31T16:17:42+05:30

రాష్ట్రంలో కనుమరుగవుతున్న తెలుగు భాషను కాపాడుకునేందుకు తెలుగు సంఘాల సమష్టి పోరాటం ద్వారానే లక్ష్యాన్ని సాధించగలమని అఖిల భారత తెలుగు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                          - ఏఐటీఎఫ్‌ అధ్యక్షుడు ఆచార్య సీఎంకే రెడ్డి


ప్యారీస్‌(చెన్నై), జూలై 30: రాష్ట్రంలో కనుమరుగవుతున్న తెలుగు భాషను కాపాడుకునేందుకు తెలుగు సంఘాల సమష్టి పోరాటం ద్వారానే లక్ష్యాన్ని సాధించగలమని అఖిల భారత తెలుగు సమాఖ్య (All India Telugu Federation) అధ్యక్షుడు ఆచార్య సీఎంకే రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక కొరట్టూర్‌లోని మోహన్‌ గార్డెన్‌ కల్యాణమండపంలో శనివారం ఉదయం ప్రొఫెసర్‌ సీఎంకే రెడ్డి అధ్యక్షతన రాష్ట్రస్థాయి ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీఎఫ్‌ చీఫ్‌ ప్యాట్రన్‌ డా.సి.మోహన్‌రెడ్డి(Dr. C. Mohan Reddy) రెండో వర్ధంతి, భారతీయ తొలి మహిళా వైద్యురాలు డా.ముత్తులక్ష్మిరెడ్డి 136వ జయంతిని పురస్కరించుకుని సభలో నివాళులర్పించారు. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయాలు, తెలుగు, ఉర్దూ, మలయాళ, కన్నడ తదితర మైనార్టీ భాషల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, జిల్లాలవారీగా ఏఐటీఎఫ్‌ శాఖలు, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై చర్చించారు. సమాఖ్య ఉపాధ్యక్షుడు గొల్లపల్లి ఇశ్రాయేల్‌(Gollapally Israel) స్వాగతం పలుకగా, ప్రధాన కార్యదర్శి ఆర్‌.నందగోపాల్‌ వార్షిక నివేదిక సమర్పించారు. ఈ సమావేశం అనంతరం విల్లివాక్కంలోని కనకదుర్గ తెలుగు పాఠశాలల నిర్వాహకులు డా.సీఎం కిషోర్‌రెడ్డిని ఏఐటీఎఫ్‌ ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. కార్యక్రమంలో వీజీ జయకుమార్‌, కేవీ జనార్ధనం, సీబీ భుజంగరామ్‌(CB Bhujangaram), కుంకు దశరధరావు, నేలటూరి విజయ్‌కుమార్‌, జి.మురళి, నామా సతీ్‌షకుమార్‌, పందిటి మస్తాన్‌, నలగట్ల ఆనందరావు, రామసుబ్బు, అడ్వకేట్‌ సత్యరాజ్‌, రొడ్డా జైరాజ్‌, మోహన్‌నాయుడు, ఐసయ్య సహా పలు జిల్లాల నిర్వాహకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-31T16:17:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising