ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలిబూడిదవుతున్న ఎలక్ట్రిక్ వాహనాలు.. ప్రతి ఘటనను దర్యాప్తు చేస్తామన్న ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-05-01T22:16:19+05:30

దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు అకస్మాత్తుగా మంటలు అంటుకుని కాలి బూడిదవుతున్న ఘటనలు రోజుకొకటి వెలుగుచూస్తున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు అకస్మాత్తుగా మంటలు అంటుకుని కాలి బూడిదవుతున్న ఘటనలు రోజుకొకటి వెలుగుచూస్తున్న నేపథ్యంలో రోడ్డు రవాణా, రహదారుల కార్యదర్శి గిరిధర అరమానే స్పందించారు. ప్రతి ఒక్క ఘటనను దర్యాప్తు చేస్తామన్నారు.


అలాగే, భారత ఈవీ  పరిశ్రమ మన ఊహకు మించి అభివృద్ధి చెందుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ మోనిటైజేషన్ పైప్‌లైన్‌లో భాగంగా 2022 ఆర్థిక సంవత్సరానికి గాను రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ (MoRTH) రూ. 21 వేల కోట్ల ఆస్తి మానిటైజేషన్ విలువను సాధించినట్టు చెప్పారు.  


కాగా, ఎలక్ట్రిక్ స్కూటర్లు కాలిబూడిదవుతున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఈ ఘటనల్లో కొందరు మృత్యవాత పడగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. తరచూ జరుగుతున్న ఇలాంటి ఘటనల వల్ల EV లీడర్‌గా ఎదగాలనుకున్న భారత ప్రతిష్ఠ మసకబారిపోదా? అన్న ప్రశ్నకు మంత్రి మాట్లాడుతూ.. అలా ఏం జరగదని, తయారీదారులు అవసరమైన భద్రతా ప్రమాణాలు పాటించడంతోపాటు  నాణ్యత నియంత్రణ, నాణ్యత హామీ వ్యవస్థలు ఏర్పాటు చేస్తే సరిపోతుందని, భారత ఈవీ పరిశ్రమ అంచనాలకు మించి అభివృద్ధి చెందుతుందని Giridhar Aramane చెప్పుకొచ్చారు.


ఎలక్ట్రిక్ వాహన ప్రమాదాలపై దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇంకా నివేదిక సమర్పించలేదన్నారు. ఈవీలకు సంబంధించి అన్ని సమస్యలు, సేకరణ, డిజైన్, నిర్వహణ, ఆపరేషన్స్, బ్యాటరీల తయారీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ వంటి వాటిని పరీక్షించాల్సి ఉందని, ఆ తర్వాత అవసరమైన ప్రతిపాదనలు చేస్తామని అన్నారు. 

Updated Date - 2022-05-01T22:16:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising