ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ ఐపీఎస్ అధికారి బీజేపీలో చేరడంపై ఈసీకి ఫిర్యాదు చేస్తా : అఖిలేశ్ యాదవ్

ABN, First Publish Date - 2022-01-16T21:43:34+05:30

మాజీ ఐపీఎస్ అధికారి అసీం అరుణ్ ఉత్తర ప్రదేశ్ ఎన్నికల తరుణంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : మాజీ ఐపీఎస్ అధికారి అసీం అరుణ్ ఉత్తర ప్రదేశ్ ఎన్నికల తరుణంలో బీజేపీలో చేరడంపై ఎన్నికల కమిషన్‌ (ఈసీ)కి ఫిర్యాదు చేస్తానని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ చెప్పారు. ఈ విషయంపై దర్యాప్తు చేయకపోతే ఈసీ పనితీరుపై ప్రశ్నలు ఉదయిస్తాయని చెప్పారు. ఈసీ సక్రమంగా, న్యాయంగా పని చేస్తున్నట్లు తాము నమ్మడం లేదన్నారు. 


ఇదిలావుండగా, ఇటీవల మంత్రి పదవికి, బీజేపీకి రాజీనామా చేసిన దారా సింగ్ చౌహాన్ ఆదివారం సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆయనకు అఖిలేశ్ యాదవ్ స్వాగతం పలికారు. ఇటీవలే మాజీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్ కూడా సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. 


మరోవైపు హిస్సేదారీ ఫ్రంట్ నేతలతో బీజేపీ సమావేశమైంది. ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల కోసం బీజేపీతో తొమ్మిది చిన్న పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. కేవలం అప్నా దళ్, నిషాద్ పార్టీలకే ప్రాధాన్యం ఇస్తున్నారని బీజేపీపై హిస్సేదారీ ఫ్రంట్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 


మరోవైపు ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ సమాజ్‌వాదీ పార్టీపై విరుచుకుపడ్డారు.  కైరానా నుంచి హిందూ వ్యాపారులు వలస పోవడానికి కారకులైనవారికి సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్లు లభించాయని, ఇదే ఆ పార్టీ పాటిస్తున్న సామాజిక న్యాయమని  ఆరోపించారు. 


403 స్థానాలున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. 


Updated Date - 2022-01-16T21:43:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising