ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘Agnipath‌’ కింద Air Force కి 4 రోజుల్లో 94 వేల దరఖాస్తులు

ABN, First Publish Date - 2022-06-28T02:27:59+05:30

త్రివిధ దళాల్లో నియామకాలకు ఉద్దేశించిన ‘అగ్నిపథ్ (Agnipath)’ పథకం కింద ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(IAF)కి కేవలం 4 రోజుల్లో 94,281 దరఖాస్తులు అందాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : త్రివిధ దళాల్లో నియామకాలకు ఉద్దేశించిన ‘అగ్నిపథ్ (Agnipath)’ పథకం కింద ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(IAF)కి కేవలం 4 రోజుల్లో 94,281 దరఖాస్తులు అందాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ గత శుక్రవారం మొదలవ్వగా సోమవారం ఉదయం 10:30 గంటల సమయానికి 94,281 మంది ‘అగ్నిపథ్ వాయు’ అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు అందాయని ఎయిర్‌ఫోర్స్ వెల్లడించింది. ఆదివారం వరకు 56,960 దరఖాస్తులు మాత్రమే రాగా. సోమవారం ఈ సంఖ్య భారీగా పెరిగిందని తెలిపింది. దరఖాస్తుల రిజిస్ట్రేషన్ గడువు జులై 5, 2022న ముగుస్తుందని రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఏ భరత్ భూషన్ బాబు ట్విటర్(Twitter) వేదికగా వెల్లడించారు.


త్రివిధ దళాల్లో నియామకాలకు ఉద్దేశించిన అగ్నిపథ్ పథకాన్ని జూన్ 14న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసన జ్వాలలు చెలరేగాయి. పలు రాష్ట్రాల్లో ఆర్మీ అభ్యర్థులు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. పలు రైళ్లకు నిప్పంటించారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. పలుచోట్ల బస్సులను కూడా తగలబెట్టి తమ నిరసన తెలిపారు. ఈ హింసాత్మక దాడుల్లో పాల్గొన్న అభ్యర్థులను బలగాల్లోకి తీసుకోబోమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.


అగ్నిపథ్ పథకం కింద పదిహేడున్నరేళ్ల నుంచి 23 సంవత్సరాల యువతకు మాత్రమే అర్హత ఉంటుంది. కరోనా కారణంగా గత రెండేళ్లు నియామకం జరగకపోవడంతో 2022లో రెండేళ్ల మినహాయింపు ఇచ్చారు. ఆ తర్వాత ఈ వెసులుబాటు ఉండదు. కాగా ఎంపికైన అగ్నివీరులకు నాలుగేళ్ల సర్వీస్ మాత్రమే ఉంటుంది. అయితే వీరిలో 25 శాతం మంది రెగ్యులర్‌గా పనిచేసేందుకు అవకాశం దక్కుతుంది.

Updated Date - 2022-06-28T02:27:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising