ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అహ్మదాబాద్‌ పేలుళ్ల తీర్పుపై.. ప్రతిపక్షాలు మాట్లాడవేం?

ABN, First Publish Date - 2022-02-23T08:14:05+05:30

ప్రపంచవ్యాప్తంగా కల్లోలం నెలకొన్నప్పుడు.. భారత దేశం పటిష్ఠంగా ఉండాలని, అలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

బహ్రైచ్‌, ఫిబ్రవరి 22: ప్రపంచవ్యాప్తంగా కల్లోలం నెలకొన్నప్పుడు.. భారత దేశం పటిష్ఠంగా ఉండాలని, అలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమర్థ నాయకత్వం అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘అహ్మదాబాద్‌ పేలుళ్ల నిందితులకు మరణ శిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుపై మాట్లాడరేం..? మీ మౌనంతో దేశంలో ఉగ్రవాదానికి మద్దతుదారులెవరో తేలిపోయింది’’ అంటూ ప్రతిపక్షాలను మోదీ నిలదీశారు. యూపీ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు బౌండరీ కొట్టబోతోందని ప్రధాని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్రాన్ని లూటీ చేసిందని మండిపడ్డారు. కాగా, డోరియాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. సమాజ్‌వాదీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు.   సీఎంగా రాజ్యాంగాన్ని రక్షిస్తానని కాకుండా.. ఉగ్రవాదులను కాపాడతానని అఖిలేశ్‌ ప్రమాణం చేశారంటూ నడ్డా వ్యాఖ్యానించారు. పలు దాడుల్లో నిందితులుగా ఉన్న ఉగ్రవాదులపై అఖిలేశ్‌ సీఎంగా ఉన్న సమయంలో కేసులు ఉపసంహరించారని ఆరోపించారు. ‘‘అహ్మదాబాద్‌ పేలుళ్లకు పాల్పడిన 38 మందికి మరణ శిక్ష విధిస్తూ కోర్టు గత శుక్రవారం తీర్పిచ్చింది. వారిలో షాదాబ్‌ అహ్మద్‌ ఒకరు. ఇతడి తండ్రి మహమ్మద్‌ సైఫ్‌ సమాజ్‌వాదీ కార్యకర్త. అఖిలేశ్‌తో కలిసి పనిచేస్తున్నారు’’ అని నడ్డా పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-23T08:14:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising